అప్పట్లో శోభన్‌బాబు తర్వాత మహిళల మనస్సు దోచుకుని.. ఇద్దరు, ముగ్గురు హీరోయిన్ల మధ్య నలిగిపోయే నటుడిగా 1990వ దశకంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. జగపతిబాబు సినిమాలు అంటే అప్పట్లో మహిళా ప్రేక్షకులు ఎంతో ఇష్టపడేవారు. ఈ క్రమంలోనే దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లరి ప్రేమికుడు సినిమాలో మనోడు ఏకంగా ముగ్గురు అందమైన హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు.
అయితే ఈ సినిమాను రాఘవేంద్రుడు ముందుగా ఓ హీరోతో చేయాలని.. ఇద్దరు హీరోయిన్లను కూడా సెట్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా అటూ ఇటూ మారి చివరకు జగపతిబాబుతో తీశారు. విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా మీనా, దివ్యభారతి హీరోయిన్లుగా ఈ సినిమా తీయాలని రాఘవేంద్రరావు అనుకున్నారు. ఈ సినిమా ప్రారంభం అయ్యే సమయానికి దివ్యభారతి మరణించింది. ఇక షూటింగ్ లేట్ అవ్వడంతో మీనా డేట్లు సర్దుబాటు చేయలేకపోయింది.
ఈ లోగా కథలో మార్పులు జరిగి మూడో హీరోయిన్ పాత్ర యాడ్ అయ్యింది. చివరకు రాఘవేంద్రరావు రంభ, సౌందర్యతో పాటు మూడో హీరోయిన్‌గా కొత్త అమ్మాయి కాంచన్‌ను ఎంపిక చేసుకున్నారు. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి కమల్ కంటే జగపతిబాబు అయితే బాగుంటాడని చివర్లో నిర్ణయం మార్చుకున్నారు. అలా ఈ సినిమాలోకి జగపతిబాబు వచ్చాడు.
1993లో షూటింగ్ ప్రారంభమై 1994లో రిలీజ్ అయిన ఈ సినిమాపై ముందు భారీ అంచనాలు ఉన్నాయి.. అయితే రిలీజ్ అయ్యాక ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.