యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ పాన్ ఇండియా హీరోగా ఉన్నాడు. బాహుబలి 1,2 తో పాటు సాహో సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మామూలుగా లేదు. అయితే ప్రభాస్ గతంలో కొన్ని సినిమాలు అనేక కారణాలతో వదులుకున్నాడు. వాటిల్లో చాలా బ్లాక్‌బస్టర్లు ఉన్నాయి. అవి కూడా ప్రభాస్ చేసి ఉంటే మనోడి రేంజ్ వేరేగా ఉండేది. అవేంటో ఓ లుక్కేద్దాం.
1- దిల్
వివి వినాయక్ దిల్ కథ ముందుగా ప్రభాస్‌కే చెప్పాడట. అయితే కృష్ణంరాజు ఆ సినిమా వద్దని చెప్పడంతో వదులుకున్నాడు. చివరకు ఆ కథతో నితిన్ ఒప్పించి సూపర్ హిట్ ఇచ్చాడు వినాయక్.
2- సింహాద్రి
రాజమౌళి సింహాద్రి కథను ముందుగా ప్రభాస్‌తోనే చేయాలని అనుకున్నాడట. అంత మాస్ కథ చేయగలనా ? అని ప్రభాస్ డౌట్ వ్యక్తం చేశాడట. చివరకు ఈ కథ బాలయ్య దగ్గరకు వెళ్లాల్సిన క్రమంలో ఎన్టీఆర్ దగ్గరకు చేరింది. అలా సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ ప్రభాస్‌కు మిస్ అయ్యింది.
3- కిక్
సురేందర్‌రెడ్డి ముందుగా ఈ కథను ప్రభాస్‌కు చెప్పాడట. కథ నచ్చినా క్యారెక్టర్ తనకు సూట్ కాదని చెప్పడంతో చివరకు రవితేజతో చేశాడు.
4- ఒక్కడు
మహేష్ బాబు కెరీర్‌ను మార్చిన ఒక్కడు సినిమాను గుణశేఖర్ ముందుగా ప్రభాస్‌తో చేయాలనుకున్నాడు. అప్పుడు ప్రభాస్ బిజీగా ఉండడంతో నో చెప్పాడు.
5- ఆర్య:
దిల్‌రాజు నిర్మాతగా సుకుమార్ దర్శకుడిగా ( ఆయనకు ఇదే తొలి సినిమా) వచ్చిన ఆర్య మూవీ కథ ప్రభాస్‌కు నచ్చక రిజెక్ట్ చేశాడట.
6- జిల్
అలాగే రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన జిల్ కథ ముందు ప్రభాస్‌కు చెపితే బాహుబలి బిజీలో ఉండి మనోడే గోపీచంద్‌ను హీరోగా సజెస్ చేశాడట.
7- నాయక్
ప్రభాస్ తో యోగి సినిమా ప్లాప్ అవడంతో వినాయక్ కసితో నాయక్ కథ ప్రభాస్‌కు చెప్పాడట. ఈ కథ నచ్చని ప్రభాస్ నో చెప్పాడట.
8- బృందావనం
ప్రభాస్‌తో మున్నా సినిమా చేసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి కొరటాల శివతో కలిసి వెళ్లి బృందావనం కథను చెపితే అది నాకు సెట్ కాదని ప్రభాస్ చెప్పడంతో చివరకు ఆ కథతో ఎన్టీఆర్ సినిమా చేసి హిట్ కొట్టాడు.
9- డాన్ శ్రీను
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ నచ్చి గోపిచంద్ మలినేని డాన్ శీను కథ రాసి ప్రభాస్‌కు చెప్పాడట. ఈ కథ చేయాలని ఉన్నా డేట్లు సర్దుబాటు కాక వదులుకున్నాడట.
10- ఊసరవెల్లి
ఈ సినిమా కూడా డేట్లు సర్దుబాటు కాక సురేందర్‌రెడ్డికి ప్రభాస్ నో చెప్పాడట.