దేవదాస్ సినిమాతో తెలుగు సినిమాకు హీరోయిన్గా పరిచయం అయిన ఇలియానా ఆ తర్వాత రెండో సినిమా పోకిరీతోనే తెలుగులో తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆ టైంలో ఇలియానాతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ టాప్ హీరోలు, దర్శకులు వెంట పడేవారు. దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత ఆమె బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇక్కడ స్టార్ డమ్ ఉండగానే దానిని వదులుకుని బాలీవుడ్‌కు వెళ్లిన ఇలియానాకు అక్కడ హిట్లు లేవు.
ఆ తర్వాత ఆమె చేసిన తప్పు తెలుసుకుని తిరిగి టాలీవుడ్లో ఛాన్సుల కోసం ట్రై చేసినా అప్పటికే ఇక్కడ అనుష్క, నయనతార, రకుల్ లాంటి క్రేజీ హీరోయిన్లు పాతుకు పోవడంతో ఇలియానాను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక ఆమె చేసెదేమీలేక..సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫోటోలు పెట్టుకుంటుంది. ఇక ప్రతి చిన్న విషయాని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ఇక తాజాగా ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
అసలు మ్యాటర్ ఎంటంటే..ఇలియానా కిచెన్ లో వంటచేస్తున్నప్పుడు.. తన వేళ్లను కట్ చేసుకుందట. అంతే అదే విషయాని ఇన్‌స్టాలో తన వేళ్లను చూపిస్తూ చిన్న పిల్లలా ఏడ్చేసింది. వంట చేసేటప్పుడు వేళ్లను కట్ చేసుకున్నా అని.. ఆ తర్వాత బ్యాండేజ్ వేసుకున్న అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా. అంతేకాదు వంట చేస్తున్న సమయంలో వేళ్లను కట్ చేసుకున్నప్పుడు ఏడ్వడం తప్పేమికాదు అని చెప్పుకొచ్చింది.