Movies"పుష్ప" నుంచి మూడో సాంగ్ కూడా వచ్చేసిందోచ్..ఇరగదీశాడుగా..!!

“పుష్ప” నుంచి మూడో సాంగ్ కూడా వచ్చేసిందోచ్..ఇరగదీశాడుగా..!!

ప్ర‌స్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లెక్కల డైరెక్టర్ సుకుమార్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య‌, ఆర్య 2 సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయో మనకు తెలిసిందే. ఇక ఆ సినిమా ల త‌ర్వాత అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్‌లో వస్తున్న ఈ సినిమా ..పాన్ ఇండియా మూవీ పుష్ప తెరకెక్కుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో బన్నీ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది. శ్రీ వ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక డీ గ్లామ‌ర్ లుక్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..ఈ సినిమాలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ర‌ష్మీక గిరిజ‌న అమ్మాయిగా కనిపించబోతుంది. ఇక బ‌న్నీ కూడా అదే తరహాలో ఆమెను ప్రేమించే గిరిజ‌న యువ‌కుడి గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అందుకే ఈ సినిమా కోసం చిత్తూరు యాస‌ను చాలా క‌ష్ట‌ప‌డి మ‌రీ నేర్చుకున్నాడ‌ని తెలుస్తోంది. మాస్ లుక్‌లో వెండితెరపై బన్నీని చూడాలని కుతూహల పడుతున్నారు.

అయితే, ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఇప్పటికే.. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి సాంగులు విడుదలై… యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండగా… ఇక తాజాగా మూడో సింగిల్ ” సామి సామి ” ప్రోమో ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. అలాగే ఫుల్ సాంగ్ ను ఈనెల 28 ఉదయం 11 గంటల 07 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను రెండు పార్ట్స్​గా తెరకెక్కిస్తుండగా.. మొదటి భాగమైన ‘పుష్ప ది రైజ్​’ను డిసెంబరు 17న థియేటర్లలో విడుదల చేయనుంది చిత్రబృందం. రిలీజ్​ డేట్​ దగ్గరు పడనుండడం వల్ల సినిమా ప్రమోషన్స్​లో జోరు చూపిస్తోంది చిత్రబృందం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news