తెలుగు సినిమా పరిశ్రమలో అక్క, అమ్మ, చెల్లి, వదిన క్యారెక్టర్లతో దూసుకు పోతోంది ప్రగతి. ఎఫ్ 2 సినిమాలో విక్టరీ వెంకటేష్‌కే అత్తగా నటించి దుమ్ము దులిపేసింది. ఇక ప్రగతి ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో హీరోయిన్గా చేసింది. తర్వాత సరైన క్యారెక్టర్లు పడకపోవడంతో బ్రేక్ తీసుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి వెళ్లిన ఆమె ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తకు దూరంగా ఉంటోంది.
ఆ తర్వాత కెరీర్లో సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసి పలు క్యారెక్టర్లతో ఇప్పుడు గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇటీవలో యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని తప్పు చేశానని చెప్పింది. చిన్న వయస్సులో పెళ్లి చేసుకోవడంతో తన జీవితం ఆనందంగా సాగలేదని.. ఈ విషయం తెలుసుకునే సరికే అన్ని జరిగిపోయాయని వాపోయింది.
ఇక ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఆమె చెప్పుకు వచ్చింది. తాను కూడా ఓ సందర్భంలో ఓ టాప్ కమెడియన్ నుంచి ఈ వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పింది. ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. తెలుగు ఇండస్ట్రీలో పేరున్న ఓ టాప్ కమెడియన్ తనను కేరోవ్యాన్లోకి పిలిచి కోరిక తీర్చాలని లైంగీకంగా వేధించాడని చెప్పింది. అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చానని.. ఆ తర్వాత అతడు నా జోలికి ఎప్పుడూ రాలేదని ప్రగతి చెప్పింది.
ఇక క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదని.. మిగిలిన రంగాల్లో కూడా ఉందని చెప్పిన ప్రగతి.. అలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొనేటప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయని చెప్పింది.