ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే తమన్నా కు ఈ మాస్టర్ చెఫ్ షో పెద్ద తలనొప్పిగా మారిన్నట్లు తెలుస్తుంది. ప్రతి రోజు ఓ హాట్ మ్యాటర్ తో తమన్నా ఈ మధ్య తరచూ ఈ షో కు సంబంధించి వార్తలో నిలుస్తుంది. మొదట ఏమో పబ్లిసిటీ కోసం హడావిడి చేసారు. ఆ తరువాత షో కి అనుకున్నంత మంచి రెస్పాన్స్ రాలేదు. ఇక దీంతో తమన్నా ను పక్కన పెట్టేసి జబర్ధస్త్ బ్యూటీ అనసూయ ని పెట్టుకున్నారు.
అయితే దీని పై తమన్నా ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తమన్నాని తొలగించడం పట్ల అనేక ప్రచారాలు నడిచాయి. ఒకానొక టైంలో తమన్నా లీగల్ యాక్షన్ కూడా తీసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో మాస్టర్ చెఫ్ నిర్వాహకులు దీనిపై వివరణ ఇస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో తమన్నాకు దిమ్మ తిగి పరిస్ధితి ఏర్పడిందని అంటున్నారు. తమన్నా ‘మాస్టర్ చెఫ్’లో హోస్ట్ చేసేందుకు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. జూన్ 24 నుంచి సెప్టెంబర్ చివరి వరకు మొత్తం 18 రోజులు షోకు హోస్ట్ గా ఉండాలని అగ్రిమెంట్ చేసుకున్నారట.
అయితే, ఆమె ఇతర కమిట్ మెంట్ల వల్ల కేవలం 16 రోజులు మాత్రమే షూటింగ్ కు వచ్చారని… రెండు రోజులు రాలేదని తెలిపారు.ఇక ఆమె ఈ రెండు రోజులు ఆమె షూటింగ్ కు రాకపోవడం వల్లఏకంగా వాళ్ళకు రూ. 5 కోట్లకు పైగా నష్టం వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికి ఆమెకు రూ. 1.56 కోట్ల పేమెంట్ చేశామని… చివరి రెండు రోజుల షూటింగ్ కూడా పూర్తి చేసి ఉంటే మిగిలిన పేమెంట్ కూడా చేసేవాళ్లమని తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం షూటింగ్ పూర్తి చేయకుండా… సెకండ్ సీజన్ అడ్వాన్స్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారని… అసలు సెకండ్ సీజన్ కు ఆమెను తీసుకోవాలని తాము అనుకోలేదని స్పష్టం చేసింది.