అసలే విడాకులు తీసుకుని పుట్టేడు బాధలో ఉన్న సమంత పై ట్రోల్స్ మరింత ఎక్కువ అవుతున్నాయి. కొందరు డబ్బు కోసం విడాకులు తీసుకుంది అంటే..మరికొందరు..కాదు కాదు వేరే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది.. ఈ విషయం కారణంగానే నాగచైతన్య-సమంత మధ్య గోడవలు మొదలైయ్యాయి. దీంతో భార్య భర్తలిద్దరు విడాకుల వరకు వెళ్లారు అంటున్నారు. ఈ ల్రమంలో విడాకుల విషయంలో చాలా రకాల పుకార్లు, ఊహాగానాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఆవార్తలతో విసిగిపోయిన సమంత పలు యూబ్యూట్ ఛానళ్లతోపాటు సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు రావడంతో సమంత కూకట్‌పల్లి కోర్టు ను ఆశ్రయించింది. తన పరువుకు నష్టం కలిగించిన సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, మరో ఛానల్‌తోపాటు సీఎల్ వెంకట్రావ్ అనే న్యాయవాదిపై సమంత పరువు నష్టం దావా వేసింది. తనపై సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వివరించిన మూడు యూట్యూబ్ ఛానల్ పై కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు సమంత.
కాగా, గురువారం సమంత తరపున న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. అయితే ఈ పిటిషన్‌ను వీలైనంత త్వరగా విచారించాలని సమంత తరఫు న్యాయవాది గురువారం ఆ కోర్టు జడ్జికి స్పెషల్ రిక్వెస్ట్ చేసారు. దీంతో న్యాయమూర్తి ఆ న్యాయవాది పై మండిపడ్డాడు. కోర్టు ముందు సామాన్యులైనా, సెలబ్రిటీలైనా అందరూ సమానమేనని.. కోర్టు సమయం చివరలో పిటిషన్‌పై విచారిస్తామని ఆయన స్పష్టం చేశారట..దెబ్బకు ఆ న్యాయవాది సైలెంట్ అయిపోయారట. ఇక అంతేకాదు..ఈ విషయంలో సమంత ను ఇండైరెక్ట్ గా పాయింట్ అవుట్ చేస్తూ.. పరువు నష్టం దావా వేసే బదులు..వారి నుంచి క్షమాపణ అడగొచ్చు కదా అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ‘సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టేది వారే.. పరువుకు నష్టం కలిగింది అనేది వారే’ కదా అని కోర్టు పేర్కొంది.