మెగాస్టార్ చిరంజీవి.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. దాని తర్వాత లూసిఫర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా చిత్రయూనిట్ మెగాస్టార్ పుట్టినరోజున టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే అదే రోజున మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేదాళం రీమేక్ టైటిల్‌గా బోళా శంకర్ టైటిల్ ప్రకటించారు. ఈ రెండు ప్రాజెక్ట్ ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నట్లు ఇదివర్కే ప్రకటైంచారు.
అయితే ఈ సినిమాలో చిరు డ్యుయల్ రోల్ చేయనున్నారట. ఇప్పటికే పలు సినిమాల్లో డ్యుయల్ రోల్ చేసిన మెగాస్టార్ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లో ఓ హార్బర్లో నడుచుకుంటూ చిరంజీవి వస్తోన్న పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ సినిమాకు ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీ.. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ కలబోతగా తెరకెక్కించనున్నాడట బాబీ. ఈ సినిమాలో చిరంజీవి తండ్రీ కొడుకుల పాత్రలో డబుల్ యాక్షన్ చేయనున్నాడట. మొత్తంగా చిరంజీవి ‘బిల్లా రంగా’, ‘ సింహపురి సింహం’, ‘రిక్షావోడు’, ‘స్నేహం కోసం’, ‘అందరివాడు’ సినిమాల్లో తండ్రీ కొడుకులుగా నటించారు. ఇపుడు మరోసారి తండ్రి కొడుకులుగా చిరంజీవి వెండితెరపై కనిపించనున్నట్లు తెలుస్తుంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మాస్ రాజా మహ రాజ రివ్తేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఇంటర్ వెల్ ముందు సీన్ లో ఓ నెగిటివ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని..టోటల్ సినిమాకి ఈ పాత్ర ప్రాణం పోస్తుందని ..అప్పటి నుండి సినిమా సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని ఫిల్మ్ నగర్ లో గుస్ గుస్లు వినిపిస్తున్నాయి. సో..దీని బట్టి చూస్తే మెగాస్టార్ కోసం నెగిటివ్ రోల్ చేయడానికి కూడా సిద్దమయ్యాడు రవితేజ..!