విలక్షణ నటుడు కమల హాసన్ కూతురు గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ సౌత్ ఇండస్ట్రీ లో వరుస విజయాలు సాధించి స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలోనే మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ఇంకా చాలామంది టాప్ హీరోల సరసన నటించడం జరిగింది. సౌత్ లో సక్సెస్ సాధించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుని విజయాలు సాధించడం జరిగింది.
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ స్టేటస్ సంపాదించుకోడానికి చాలా కష్టపడిన శృతి..నటిగా, సింగర్‌గా, మంచి డ్యాన్సర్‌గా ఎదుగుతూ.. కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సమయంలో తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు సినిమాలకు దూరమై.. మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ‘క్రాక్’, ‘వకీల్‌సాబ్’ సినిమాలతో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకుంది. రీ ఎంట్రీ తరువాత మంచి మంచి సినిమా కంటెంట్ స్టోరీలు సెలక్ట్ చేసుకుని దూసుకుపోతుంది శృతి హాసన్.
ప్రస్తుతం శృతి హాసన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్’ లో నటిస్తుంది. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన ఒక ఏడాదిలో తెలుగు, తమిళ, హింది భాషల్లో ఒక సినిమా చేయాలని ఒక కండీషన్ పెట్టుకున్నారట. సో..అప్పుడు అన్ని భాషల్లో కథ, మరియు పాత్రలపై పట్టు సంపాదించే అవకాశం ఉంటుందిగా..అందుకే సలార్ సినిమాలో నటిస్తే.. ఒకే సారి ఐదు భాషల్లో సినిమా చేసిన ఫీలింగ్ ఉంటుందని.. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పుకొచ్చింది. సలార్ పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఐదు భాషల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.