టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్- పాకిస్తాన్‌ల మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులకే కాదు యావత్ క్రీడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ అంటేనే అదో థ్రిల్. దాయాదిపై సమరం ఓ సూపర్ ఎన్‌కౌంటర్‌లా ఉంటుంది. ఇక క్రికెట్ ప్రేక్షకులు టీవీలకే హత్తుకుపోతారు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఆ మజాయే వేరు.
ఇప్పటి వరకూ ప్రపంచకప్ టోర్నీల్లో ఒక్కసారి కూడా పాక్ చేతిలో భారత్ ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పాక్ జట్టు కసిగా ఉంది. గెలుపును ఫ్యాన్స్ తమ దేశ ప్రతిష్టగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే మెగాటోర్నీల్లో పాక్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం కాగా.. ఆ లెక్కను సరిచేయాలనే కసితో పాక్ రగిలిపోతుంది. పాక్ జట్టు సారధి బాబర్ ఆజమ్ అద్భుత ఫామ్‌లో ఉండటం ఆ జట్టులో ఆశలు రేపుతోంది. ఈ క్రమంలో ఆ ఒక్క ఆట్గాడిని మన వాళ్ళు అవుట్ చేయగలిగితే..ఈ మ్యాచ్ లో మందే విజయం అంటున్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మ్యాచ్ మాట్లాడుతూ. ” మేం గత ఫలితాల గురించి ఆలోచించడం లేదు. మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాం. భారత్‌తో మ్యాచ్ కోసం వంద శాతం సన్నద్ధమయ్యాం కాబట్టి ఎలాంటి ఒత్తిడి పెంచుకోవడం లేదు. టోర్నీకి బయల్దేరడానికి ముందు ప్రధాని, దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాతో మాట్లాడి స్ఫూర్తి నింపారు. దాంతో మా ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని బాబర్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో పాకిస్తాన్‌పై టీమిండియాదే పైచేయి అన్న విషయం తెలిసిందే.