రకుల్ ప్రీత్ సింగ్.. అప్పుడెప్పుడో పదేళ్ల కిందట సినిమాలోకి వచ్చిన ఈ భామా..ఇంకా మంచి మంచి అవకాశాలతో హీరోయిన్ గా నెట్టుకొస్తుంది. కన్నడ సినిమా గిల్లితో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత హిందీలో యారియాన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ వెంటనే సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత నెనక్కి తిరిగి చూసుకునే పనే లేకుండా పోయింది ..వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది రకుల్.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత సమయంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన బాయ్ ఫ్రెండ్ అంటూ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇక అప్పటి నుండి ఆయన పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఇక తాజాగా పుట్టిన రోజు జరుపుకున్నా రకుల్‌కు వాటర్ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి మనకు తెలిసిందే. రకుల్ ఎక్కువుగా సముద్రాలు, బీచ్‌ల్లో తిరగడం అంటే ఇష్టమని చాలా సంధర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇక రీసెంట్ గా ఆమె బికినీలో కనిపించి ట్రీట్ ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్‌లో దూకి ఈత కొట్టే వీడియో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు కరోనా లేని రోజుల్లో ఎంజాయ్ చేసిన డేస్ గుర్తుకు వస్తున్నాయంటూ.. మాస్కుల్లేకుండా తిరిగిన రోజులు నాకు మళ్ళి కావాలంటూ రకుల్ పోస్ట్ చేసింది.
View this post on Instagram