Moviesఅంచనాలు పెంచేస్తున్న శ్రీవల్లి.."పుష్ప" నుండి ర‌ష్మిక మ‌రో లుక్ విడుద‌ల..!!

అంచనాలు పెంచేస్తున్న శ్రీవల్లి..”పుష్ప” నుండి ర‌ష్మిక మ‌రో లుక్ విడుద‌ల..!!

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిపోయారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘పుష్ప’. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’.రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ సినిమా తొలి భాగం డిసెంబర్‌లో విడుదల అవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌.

ఈ సినిమాలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మీక మదన నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆమెకు సంబంధించి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చెసింది చిత్ర బృందం.ఆ లుక్ లో రష్మిక ఎంతో అందంగా..పెళ్లికి రెడీ అవుతున్నట్లుగా ఉంది. ఆదే సమయంలో భయపెడుతున్న శ్రీవాల్లి గాను అదరగొట్టేసింది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్‏తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 17న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు.

ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. మరో సింగిల్ ను రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది. ఈ సాంగ్ అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేస్తూ ర‌ష్మిక లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. చూస్తుంటే సెకండ్ సాంగ్ శ్రీవ‌ల్లి పాత్ర పోషిస్తున్న ర‌ష్మిక పై ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా రష్మిక మందన్నా ఫస్ట్ టైం అల్లు అర్జున్ పక్కన హీరోయిన్‌గా చేస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news