టాలీవుడ్లో భారీ సినిమాలు అన్ని షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అయితే ఏ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఒక్క మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలే వచ్చే యేడాది 10కు పైగా రిలీజ్‌కు వెయిటింగ్లో ఉన్నాయి. ఇక మామ మెగాస్టార్ చిరంజీవి, అల్లుడు బన్నీ సినిమాలకు ఇప్పుడు పోటీ తప్పేలా లేదు.
బన్నీ పుష్పను డిసెంబర్ 17న రిలీజ్ అంటూ పోస్టర్ వేశారు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్యపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్యకు సరైన డేట్ లేదు. ఆర్ ఆర్ ఆర్ ఉండడంతో ఆచార్య సంక్రాంతికి రాదు. డిసెంబర్ 24న వేయాలనుకుంటే అది ఆర్ ఆర్ ఆర్ డేట్‌కు చాలా దగ్గర్లో ఉంది. అప్పటకి థియేటర్లు పూర్తిగా ఖాళీ చేయాలి.
ఇక మిగిలింది డిసెంబర్ 17 యే అంటున్నారు. అంటే పుష్ప వర్సెస్ ఆచార్య మధ్య పోటీ తప్పదు. అయితే పుష్ప ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ చాలానే ఉందని.. అది ఆ డేట్‌కు రావడం సులువు కాదని అంటున్నారు. పుష్ప ఆ డేట్‌కు రాకపోతే ఆచార్య ఆ డేట్‌కే వచ్చేలా ప్రయత్నాలు నడుస్తున్నాయట. ఇక్కడో ఇంకో సమస్య ఉంది.. అదే టైంకు ఓవర్సీస్లో క్రిస్మస్ సీజన్.
ప్రతి యేడాది అక్కడ క్రిస్మస్కు రెండు, మూడు పెద్ద సినిమాలు ఉంటాయి. ఆ టైంలో అక్కడ వసూళ్లు అంత బాగా ఉండవు. ఏదేమైనా డిసెంబర్ 17న మామ, అల్లుడు సినిమాలలో ఏది థియేటర్లలోకి వస్తుందో ? చూడాలి.