Moviesసమంత సంచలన పోస్ట్..వాళ్లకి చెప్పుతో కొట్టే సమాధానం ఇచ్చిందిగా..!!

సమంత సంచలన పోస్ట్..వాళ్లకి చెప్పుతో కొట్టే సమాధానం ఇచ్చిందిగా..!!

సమంత గత కొన్ని వారాలు గా డైవర్స్ విషయంలో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రీజన్ ఏంటో తెలియదు కానీ ఎంతో హ్యాపీగా చూడ ముచ్చటైన జంట..టాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ కపుల్ అనిపించుకున్న ఈ జంట విడాకులు వైపు అడుగులేస్తున్నారు. నాగచైతన్య, సమంత జంట మధ్య ఏదో జరుగుతోందని ఊహాగానాలు మొదలైన కొద్ది రోజులకే.. వాటిని నిజం చేస్తూ శనివారం మేం విడిపోతున్నాం తమ దారులు వేరని ఇద్దరూ ప్రకటించేసారు. ఇక ఈ జంట విడాకుల పై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ వారి జీవితం వారి ఇష్టం..మధ్యలో మనం ఇన్వాలవ్ అవ్వకూడదు వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇవ్వండి అంటూ పోస్ట్లు చేస్తున్నారు.

ఇక ఈ జంట విడిపోతున్నప్పటి నుండి స‌మంతనే టార్గెట్ చేస్తూ కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె కు ఒళ్ళు కొవ్వేకి ఇలా చేసిందని..నాగ చైతన్య మంచి వాడు అని,అక్కినేని ఫ్యామిలీకి కోడలు గా వెళ్ళడాం ఆమె అదృష్టమని..ఇక సమంత విడాకులు తీసుకుని సరిదిద్దుకోలేని తప్పు చ్జేసిందని మండిపడుతున్నారు కొందరు అభిమానులు. ఇక మరి కొందరైతే పిక్క్స్ కు వెళ్ళి సమంత కు తన పర్సనల్ స్టైలిస్ట్ తో ఎఫైర్ ఉందని కూడా అంటున్నారు. మరికొందరు ఏమో సినిమాల కోస‌మ‌ని ఇలా ఏవేవో కార‌ణాల‌తో స‌మంత‌ని టార్గెట్ చేస్తూ విమ‌ర్శిస్తున్నారు.

ఈ క్ర‌మంలో స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను విమర్శిస్తున్న వాళ్ళకి చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిందని అంటున్నారు ఆమె అభిమనులు. ఇంతకి ఆమె ఏం పోస్ట్ ప్ట్టిందో తెలుసా..?? స‌మాజం మ‌గాళ్లని ఎందుకు ప్ర‌శ్నించ‌దు ..మహిళలు ఏం చేసినా నైతికత గురించి ప్రశ్నిస్తారు. మరి మగవాళ్లు చేస్తే ఈ ప్రశ్న ఎప్పుడూ ఉండదు. అలాంటప్పుడు ఓ సమాజంగా మనకే ఏ నైతికత లేదు” అంటూ ఓ కొటేషన్‌ను పోస్ట్‌గా పెట్టింది. ఇక చైతూ నుండి దూర‌మయ్యాక స‌మంత లోలోప‌ల చాలా బాధ‌ప‌డుతున్న‌ట్టు సన్నిహిత వర్గాల వారు చెబుతున్నారు. ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె షాట్‌ గ్యాప్‌లో కంటతడి పెట్టుకున్నారట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news