సమంత – నాగచైతన్య విడిపోవడంతో ఇప్పుడు ఈ జంట గురించి మామూలు చర్చ… రచ్చ జరగడం లేదు. ఎక్కడ చూసినా ఇవే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రతి ఒక్కరు వీరి గురించే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే చైతుతో విడాకులు తీసుకుంటున్నట్టు సమంత ప్రకటన చేసిన వెంటనే తన పేరు మార్చేసుకుంది.
అంతకు నెల రోజుల ముందే ఆమె తన సోషల్ మీడియా అక్కౌంట్లలో అక్కినేని పేరు తొలగించింది. ఇక విడాకుల తర్వాత ఇన్‌స్టా, ట్విట్టర్ అక్కౌంట్లలో పేరును సమంతా అని పెట్టుకుంది. అయితే సమంత ఫేస్‌బుక్ అక్కౌంట్‌కు మాత్రం ఇంకా సమంత అక్కినేని అనే ఉంది. బహుశా ఫేస్‌బుక్ అక్కౌంట్‌ను ఈ హడావిడిలో పడి ఆమె మర్చిపోయి ఉంటుందేమో ? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇక సమంత ప్రాణ స్నేహితురాలు అయిన సింగర్ చిన్మయి సైతం ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదని చేసిన పోస్టు కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. చిన్నయి మెసేజ్‌లో పెళ్లికి ముందే మీ ఖర్చులు, ఆదాయం, అప్పులు, మతం, అభిరుచులు, పిల్లల పెంపకంపై అభిప్రాయాలు, కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు, కెరీర్, విద్య తో పాటు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామిపై మీకున్న అంచనాల గురించి కూడా ముందే చర్చించుకోవాలని సూచనలు చేయడంతో పాటు ఫైనల్‌గా ఆమె జీవితానికి ప్రేమ ఒక్కటి మాత్రమే సరిపోదని చెప్పింది.