దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలకు, స్టార్ హీరోల అభిమానులకు టార్గెట్ అవుతున్నాడా ? అంటే అవుననే అంటున్నారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ఇప్పటికే మూడు నాలుగు సార్లు రిలీజ్ డేట్లు ప్రకటించాక కూడా వాయిదా పడింది. ఇక ఇప్పుడు వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పటికే వచ్చే సంక్రాంతి రేసులో ఉన్నామని మూడు నాలుగు పెద్ద సినిమాలు డేట్లు కూడా వేసుకుని కూర్చొన్నాయి.
అయితే రాజమౌళి తాను నేరుగా స్పందించకుండా తన కుమారుడు కార్తికేయతో పాటు ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్యతో కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్లు చేసి తాము కూడా సంక్రాంతికే వస్తున్నామంటూ లీకులు వదిలి ఒకేసారి టఫ్న రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడంతో మిగిలిన సినిమాల వాళ్లు రగిలిపోతున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో భీమ్లా నాయక్ జనవరి 12న – సర్కారు వారి పాట 13న – రాధే శ్యామ్ 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఒకే సీజన్ లో వస్తున్నట్లు చెప్పడంతో సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ హీటెక్కుతుందనే అందరూ అనుకున్నారు.
అయితే ఇప్పుడు ముందు దసరాకు వస్తున్నట్టు చెప్పిన ఆర్ ఆర్ ఆర్‌ను సంక్రాంతికి వేయడంతో అటు పవన్, ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ ముగ్గురూ కూడా రాజమౌళిపై విరుచుకు పడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సైతం రాజమౌళిని టైం చూసుకుని దెబ్బకొట్టాలని చర్చించుకుంటున్నారు. మరీ ఇంత వన్‌సైడ్‌గా వ్యవహరించడం కరెక్ట్ కాదనే అంటున్నారు.