Moviesఅత‌డి వ‌ల్లే స‌మ‌స్య‌లు.. అందుకే రాజీనామా: బాంబు పేల్చిన శ్రీకాంత్‌

అత‌డి వ‌ల్లే స‌మ‌స్య‌లు.. అందుకే రాజీనామా: బాంబు పేల్చిన శ్రీకాంత్‌

మా ఎన్నిక‌ల్లో సినిమా బిడ్డ‌లం అంటూ పోటీ చేసిన ప్ర‌కాష్ రాజ్ ఫ్యానెల్ ఈ రోజు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మా అధ్య‌క్షుడిగా ప్ర‌కాష్ రాజ్ ఓడిపోయారు. అయితే ఆయ‌న ఫ్యానెల్ నుంచి మాత్రం 11 మంది గెలిచారు. అయితే వీరంతా కూడా ఈ రోజు సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు. క్రాస్ ఓటింగ్ జ‌ర‌గ‌డంతో త‌మ ఫ్యానెల్ నుంచి కొంద‌రు గెలిచారు.. మ‌రి కొంద‌రు ఓడిపోయార‌న్నారు.

అయితే ఈ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ జ‌రిగింద‌ని.. రౌడీయిజం కూడా జ‌రిగింద‌ని… బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో త‌ప్పు జ‌రిగింద‌ని ప్ర‌కాష్ రాజ్ అన్నారు. అయినా ఎన్నిక‌లు ఆప‌కూడ‌ద‌ని తాము సైలెంట్‌గానే ఉన్నామ‌ని చెప్పారు. ఇక రాత్రికి ఓ రిజ‌ల్ట్‌.. తెల్లారే స‌రికి మ‌రో రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని కూడా ఆయన అనుమానం వ్య‌క్తం చేశారు. ఇలాంటి వాతావ‌ర‌ణంలో తాము గెలిచిన ఫ్యానెల్‌తో క‌లిసి ప‌నిచేయ‌లేమ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చి తాము రాజీనామాలు చేస్తున్న‌ట్టు చెప్పారు.

ఇక శ్రీకాంత్ మాట్లాడుతూ న‌రేష్ వ‌ల్లే ఇన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని.. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే విష్ణు ప‌ని చేస్తార‌న్న‌ది త‌మ‌కు తెలుసు అని.. అందుకే తాము టోట‌ల్‌గా మా ఫ్యానెల్ నుంచే త‌ప్పుకుంటున్నామ‌ని.. విష్ణు పూర్తి స్వేచ్ఛ‌తో ఈ రెండేళ్లు ప‌ని చేసుకోవ‌చ్చ‌ని శ్రీకాంత్ చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news