Movies“మా”కి పోటిగా మరో కొత్త అసోసియేషన్..ప్ర‌కాష్ రాజ్ సంచలన నిర్ణయం..?

“మా”కి పోటిగా మరో కొత్త అసోసియేషన్..ప్ర‌కాష్ రాజ్ సంచలన నిర్ణయం..?

గత కొన్ని రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అధ్యక్ష పదవి కోసం నానా హంగామా జరిగింది. ఎట్టకేలకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ముగిశాయి. ఎలక్షన్స్ జరిగి మంచు విష్ణు మా పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మంచు విష్ణు మా అధ్య‌క్షుడిగా గెలిచారు. అయితే అసలు ఆట ఆ త‌ర్వాతే మొదలైంది. ప్రకాష్ రాజ్ ఓడిపోయారు అని తెలిసినప్పటి నుంచి ఓడిపోయిన ప్ర‌కాష్ రాజ్ ఫ్యానెల్ లో ఒక్కోక్కరుగా ..అందరూ రాజీనామా చేస్తూ వస్తున్నారు. ముందుగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మా ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు.

ఆ త‌ర్వాత ప్ర‌కాష్ రాజ్ .. ఆ త‌ర్వాత మా మాజీ అధ్య‌క్షుడు శివాజీ రాజా.. ఇక ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్ ఫ్యానెల్ నుంచి గెలిచిన 11 మంది కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తున్న‌ట్టు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో మా వ్యవహారం హాట్ హాట్ గా మారింది. అంతేకాదు..మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు పోటీగా మరొక కొత్త అసోసియేషన్ రాబోతుందంటూ ఇండస్ట్రీలో గట్టి ప్రచారం మొదలైంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన సభ్యులంతా ‘మా’ని వీడతారని అంటున్నారు.

‘మా’కు పోటీగా ‘ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ఆత్మా)’ పేరుతో కొత్త అసోసియేషన్ ను ఏర్పాటు చేస్తారని సినీ ఇండస్ట్రీలో హాట్ టాక్ వినిపిస్తుంది. ఫిలింనగర్ సర్కిల్‌లో హాట్‌హాట్‌గా మారిన టాపిక్‌ ఈ మ్యాటర్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సిని చరిత్రలో ఇప్పటి వరకు ఒకటే అసోసియేషన్ ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితుల ప్రభావంతో 2 అసోసియేషన్లు ఏర్పడే అవకాశం ఉంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news