Moviesమొద‌టి భార్య‌తో విడాకుల‌కు షాకింగ్ రీజ‌న్ చెప్పిన ప్రకాష్‌రాజ్‌..!

మొద‌టి భార్య‌తో విడాకుల‌కు షాకింగ్ రీజ‌న్ చెప్పిన ప్రకాష్‌రాజ్‌..!

సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌కాష్‌రాజ్ ఇటీవ‌ల మా ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసి ప్ర‌ముఖంగా మీడియా చ‌ర్చ‌ల్లో నిలిచారు. ఆయ‌న తాజా ఇంట‌ర్వ్యూలో త‌న మొద‌టి భార్య ల‌లిత‌ కుమారికి ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వ‌చ్చిందో కార‌ణం చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చారు. మొద‌టి భార్య‌తో ప్ర‌కాష్‌రాజ్‌కు ఇద్ద‌రు కూతుళ్లు, ఒక కొడుకు పుట్టాడ‌ట‌. అయితే ఐదేళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు ఆ కొడుకు గాలి ప‌టం ఎగ‌ర‌వేస్తూ ప్ర‌మాద వ‌శాత్తు చ‌నిపోయాడ‌ట‌. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వారు విడిపోయార‌ట‌.

అయితే తాను త‌న భార్య‌కు మాత్ర‌మే విడాకులు ఇచ్చాన‌ని.. నా పిల్ల‌ల‌కు, వారి త‌ల్లికి విడాకులు ఇవ్వ‌లేద‌ని..అలాగే త‌న త‌ల్లి ఆమె కోడ‌ల‌కు విడాకులు ఇవ్వ‌లేద‌ని వారి మ‌ధ్య అనుబంధం బ‌య‌ట పెట్టాడు. ఇక తాను రెండో పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన‌ప్పుడు కూడా త‌న పెద్ద కుమార్తె ఒప్పుకుంద‌ని.. వారి స‌మ‌క్షంలోనే తాను మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నాన‌ని చెప్పాడు. ఇక 2010లో ప్ర‌కాష్‌రాజ్ పోని వ‌ర్మ అనే డ్యాన్స‌ర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు.

ముందు భార్య కుమార్తెలు రెండో భార్య కుమారుడిని త‌మ్ముడిగానే భావిస్తార‌ట‌. వీళ్లు వీలున్న‌ప్పుడ‌ల్లా చెన్నై వెళ్ల‌డం.. వారు హైద‌రాబాద్ రావ‌డం జ‌రుగుతుంద‌ట‌. ఇక మొద‌టి భార్య రెండో భార్య‌కు చీర‌లు పంప‌డం.. రెండో భార్య మొద‌టి భార్య‌కు చీర‌లు పంప‌డం కూడా జ‌రుగుతుంద‌ని ప్ర‌కాష్ తెలిపాడు. అలాగే రేపు త‌న కుమార్తె పెళ్లి జ‌రిగితే తాను, పెద్ద భార్య లలిత పెళ్లి మీట‌ల మీద కూర్చునే పెళ్లి చేస్తామ‌ని చెప్పాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news