Moviesక్రేజీ అప్డేట్: అంచనాలు పెంచేసిన పుష్ప సినిమా ..శ్రీ వ‌ల్లి ప్రోమో...

క్రేజీ అప్డేట్: అంచనాలు పెంచేసిన పుష్ప సినిమా ..శ్రీ వ‌ల్లి ప్రోమో సాంగ్ విడుద‌ల‌..!!

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇటు సుక్కు కూడా రంగ‌స్థ‌లం లాంటి యునాన‌మ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని పుష్ప మీదే వ‌ర్క్ చేస్తున్నాడు. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’.రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ సినిమా తొలి భాగం డిసెంబర్‌లో విడుదల అవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మీక మదన నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆమెకు సంబంధించి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చెసింది చిత్ర బృందం.ఆ లుక్ లో రష్మిక ఎంతో అందంగా..పెళ్లికి రెడీ అవుతున్నట్లుగా ఉంది. ఆదే సమయంలో భయపెడుతున్న శ్రీవాల్లి గాను అదరగొట్టేసింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ సినిమా నుంచి రెండో సింగిల్ రేపు విడుద‌ల కానుండ‌గా, దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌ల చేశారు. ఇది ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.హీరోయన్‌గా రష్మిక మందన పోషిస్తున్న ‘శ్రీవల్లి’ పాత్రపై రూపొందించిన ఈ పాట ప్రోమో తాజాగా రష్మిక మందన పోషిస్తున్న ‘శ్రీవల్లి’ పాత్రపై రూపొందించిన ఈ పాట ప్రోమోని విడుద‌ల చేశారు.

‘చూపే బంగారమయనే శ్రీవల్లి’ అంటూ సాగే ఈ పాటకి సంబంధించిన వీడియోని 19 సెకన్ల ప్రోమోగా వ‌దిలారు. ఇక ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ శ్రీరామ్ ఆలపించగా.. హిందీలో జావేద్ అలి పాడారు. చంద్రబోస్ పాటకు సాహిత్యం అందించారు.పాటలోని రెండు లైన్లే ఇంత బాగుంటే ఇక పాట ఎంత బాగుంటుందో అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news