Moviesరెబల్ స్టార్ కృష్ణం రాజును ప్ర‌భాస్ అలానే పిలుస్తారట..ఎందుకంటే..?

రెబల్ స్టార్ కృష్ణం రాజును ప్ర‌భాస్ అలానే పిలుస్తారట..ఎందుకంటే..?

టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్‌ ముందుంటారు. ఈ పాన్‌‌ ఇండియా స్టార్‌ పెళ్లికి సంబంధించి ఎప్పుడూ పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ప్ర‌భాస్ పెద్ద‌మ్మ శ్యామ‌లా దేవి త‌న బిడ్డ‌కు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశారు. దీంతో ప్రభాస్ పెళ్లి టాపిక్ మళ్లి మీడియాలో వైరల్ గా మారింది. రెబల్ స్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసిన కృష్ణంరాజు అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఎంతగానో గౌరవిస్తారు. ముఖ్యంగా వారు ఇచ్చే మారియాదలకు ఎవరైనా సరే ఫ్యాన్ అవ్వాల్సిందే.

రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ లుక్ లోనే మాస్ హీరోగా మంచి ఇమేజ్ సంపాదించాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించకున్నా..రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ చిత్రంతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక బాహుబలి సినిమాతో ఈయన రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. జాతీయ వ్యాప్తంగా గుర్తింపు రావడం ఎవరికైనా ఆనందదాయకమే. కానీ ఆ తరువాత కూడా ఆ పేరుని అలానే నిల బెట్టుకోవాలి అదే అసలు మ్యాటర్. ఇక అలాంటి పరిస్థితులను ప్రభాస్ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. కెరీర్ పరంగా మంచి మంచి సినిమాలు సెలక్ట్ చేసుకుంటూ టాప్ హీరో గా కొన సాగుతున్నారు.

ఇక రీసెంట్ గా వాళ్ల పెద్దమ్మ శ్యామ‌లా దేవి ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ..ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్త‌య్యాక పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌భాస్ అంటున్నాడు అని చెప్పుకొచ్చారు అంతేకాదు.. ప్రభాస్ తనను ప్రేమగా కన్నమ్మ అని పిలుస్తాడని పెదనాన్న కృష్ణంరాజును పెద్ద బాజీ అని పిలుస్తాడని..అదేవిధంగా ఫోన్లలో కూడా తమ పేర్లను సేవ్ చేసుకున్నాడని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. ప్రభాస్-కృష్ణంరాజు కలసి ఇప్పటివరకూ రెండు సినిమాలు చేశారు. బిల్లా..రెబల్ అ రెండు సినిమాలు. ఆ రెండూ అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి. అయితే, కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరూ కలిసి అభిమానులకు మాత్రం మంచి అనుభూతిని పంచారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రాధే శ్యాం సినిమాలో కలిసి తెర పై స్నిపించ్బోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news