ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ సీనియర్లలో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ. అలాగే తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి హీరో కూడా. స్టార్ హీరో కొడుకుగా పుట్టినంత మాత్రాన స్టార్ కాలేరు. ఎదో ఒక ప్రత్యేకత, అందం, అభినయం లేకపోతే ప్రేక్షకులు హర్షించరు. అలాంటి ఓ లెజెండ్ నందమూరి తారకరామారాము కడుపున పుట్టి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు నట సింహం బాలకృష్ణ.
నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఆయన సినిమాల్లో సింహం లాగ ఎలా అయితే కనిపిస్తుంటారో నిజ జీవితం లో కూడా అలాగే ఉంటాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనసులో ఒక్కటి పెట్టుకుని.. బయటకి ఒకటి చెప్పడం..చేయడం ఆయనకు చేత కాదు. ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్లు.. మొహన్నే దాచిపెట్టకుండా మాట్లాడుతాడు ఈ లెజెండ్. అది ఎవరైనా సరే ఎదురుగా ఎంత పెద్ద వ్యక్తయినా ఉండని ఆలోచిం చాడు.. తప్పు చేస్తే బాలయ్య ఎవరిని వదలడు. ఈ విషయం అందరికి తెలిసందే. ఎంతైనా పులి బిడ్డ కదా.. ఆయన పోలికలు ఎక్కడికిపోతాయి చెప్పండి.
అయితే వరుస్ సినిమాలకు సీన్ చేస్తూ..యంగ్ హీరోలకు ఏమాత్రం తీసీపోకుండా తనదైన స్టైల్లో దూసుకుపోతున్న బాలయ్య..అఖండ సినిమాతో అతి త్వరలోనే మరో బ్లాక్ బస్టర్ విజయం అందుకోనున్నాడు. నిజానికి ఈ సినిమాపై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ, రెండు టీజర్లు విడుదలైన తర్వాత అవి అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి.కాగా..నందమూరి బాలకృష్ణ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలం లో ఓటిటి సంస్థ ఆహా సినీ స్టార్స్ తో టాక్ షో లను నిర్వహిస్తుంది. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇలా చాలా మంది స్టార్స్ టాక్ లో షో లలో పాల్గొన్నారు. కాగా తాజాగా ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో ఆహా ఓ టాక్ షో ను నిర్వహించనున్నారనే టాక్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇప్పటికే ఓటిటి సంస్థ ఆహా స్ట్రీమింగ్ సంస్థ బాలయ్య తో మాట్లాడారు అని.. అంతా ఓకే అయితే త్వరలోనే ఆయన సదరు స్ట్రీమింగ్ సంస్థకు చెందిన ఓటీటీ షోలో సందడి చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు పండగే పండగ అని చెప్పుకోవాలి..!!