అక్కినేని వారసుడు నాగచైతన్య – స్టార్ హీరోయిన్ సమంత నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికేశారు. వీరిద్దరు కూడా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటన చేశారు. 2010లో వచ్చిన ఏమాయ చేశావే సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు ఆ సినిమాతో స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓవరాల్‌గా 11 ఏళ్ల పాటు వీరు స్నేహితులుగా, ఇందులో నాలుగేళ్ల పాటు భార్య, భర్తలుగా ఉన్నారు.
చైతు – సామ్ కాంబినేషన్లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయనే చాలా మంది అనుకుంటారు. అయితే వీరి కాంబినేషన్లో మరో సినిమా కూడా ఉంది. ఆ వివారాలేంటో ఇప్పుడు తెలుసుకుకుందాం. ముందుగా ఏమాయ చేశావే సినిమాలో వీరు హీరో, హీరోయిన్లుగా నటించారు. 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇది చైతుకు రెండో సినిమా.. సామ్‌కు తొలి సినిమా.
ఇక 2014లో అక్కినేని ఫ్యామిలీ సినిమా మనంలో మరోసారి వీరు జోడీ కట్టారు. అదే యేడాది వచ్చిన ఆటోనగర్ సూర్య సినిమాలో మూడో సారి కలిసి నటించారు. ఇక పెళ్లయ్యాక వీరు మజిలీ సినిమాలో మరోసారి జోడీ కట్టారు. ఈ నాలుగు సినిమాల్లో ఆటోనగర్ సూర్య ప్లాప్ కాగా.. మిగిలిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాలతో పాటు సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ సినిమాలో చైతు గెస్ట్ రోల్లో మెరిశాడు.
ఓ బేబీ కూడా సూపర్ హిట్ అవ్వడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇక సామ్ మామ నాగార్జునతో కలిసి మనం సినిమాతో పాటు రాజుగారి గది 2 సినిమాలోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.