మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ నుంచి గెలిచిన 11 మంది తమ పదవులకు రాజీనామా చేయడంతో పాటు విష్ణు ఫ్యానెల్ స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణం కల్పిస్తున్నామని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం జరిగిన ప్రెస్మీట్లో ప్రకాష్‌రాజ్ ఫ్యానెల్ సభ్యులు మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ నుంచి పోటీ చేసిన సీనియర్ నటుడు బెనర్జీ సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఓ వైపు మా పోలింగ్ జరుగుతుంటే మోహన్‌బాబు తన వద్దకు వచ్చి గంట సేపు అమ్మనా బూతులు తిట్టారంటూ బోరున విలపించారు. మంచు లక్ష్మి పుట్టినప్పటి నుంచే తాను ఎత్తుకుని పెంచానని.. విష్ణును కూడా చిన్నప్పటి నుంచే తాను ఎత్తుకుని ఆడించే వాడిని అని బెనర్జీ మోహన్‌బాబు కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మోహన్‌బాబు బూతులు తిడుతుంటే తాను ఎంతో కుమిలి పోయానని.. ఆయన నన్ను కొడతానికి కూడా వచ్చారని.. ఆ సమయంలో విష్ణు, మనోజ్ ఇద్దరూ వచ్చి అన్నా సారీ మీరు తిరిగి ఏమీ అనవద్దంటూ బతిమిలాడారని బెనర్జీ చెప్పారు.
తర్వాత మోహన్‌బాబు భార్య నిర్మల గారు కూడా తనకు ఫోన్ చేసి జరిగిన విషయంపై ఏమీ అనుకోవద్దని చెప్పారని.. అయినా ఈ సానుభూతి తనకు వద్దని అన్నారు.