మెహ్రీన్.. అమ్మడు అందాలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చూసేందుకు చక్కటి రూపం..చూడాగానే అట్రాక్ట్ చేసే నవ్వు..అంతకు మించి ఫిజిక్ తో కుర్రకారుని అల్లాడిస్తుంది. ఇక మొదటి సినిమా కృష్ణగాడి వీరప్రేమ గాధ తో వెండితెరకు పరిచయమైన నటి మెహ్రీన్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు. సినిమా హిట్టా..ఫట్టా అని ఆలోచించకుండా..వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లింది. త్ద్వార తన నటనకు మంచి మార్కులే వేయించుకుంది.
అయితే కెరీర్ పిక్స్ లో ఉండగానే మెహ్రీన్ .. గ్రాండ్‌గా భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. పోనీలే పెళ్లించేసుని సెటిల్ అయ్యిపోతుంది అని అనుకున్న కరమంలో అంతలోపే మెహ్రీన్ షాక్ ఇచ్చారు. భవ్య భిష్ణోయ్‌తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నామని, ఇకపై ఇంతటితోనే తమ బంధం ముగిసిందని పెళ్లి పెటాకులైనట్టు ప్రకటించేశారు మెహ్రీన్.
ఇక పెళ్లి బంధం ఇలా తెగిపోవడంతో రకరకాల వార్తలు వచ్చాయి. కానీ మెహ్రీన్ అవి ఏం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. వరుస సినిమాలకు సై చేస్తూ కెర్రిర్ ను స్పీడ్ అప్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ అభిమానులను మాత్రం ఓ విషయంలో నిరాశపరుస్తుంది ఈ బ్యూటీ. కాకపోతే ఒకప్పుడు నిండుగా కనిపించిన మెహ్రీన్.. ఈ మధ్య మరీ బక్కచిక్కి కళ కోల్పోవడమే తన అభిమానులకు కొంచెం నిరాశ కలిగిస్తున్న విషయం.
మళ్లీ కొంచెం ఒళ్లు చేసి ఇదే స్థాయిలో గ్లామర్ విందు చేస్తే ఆమె కెరీర్‌కు ఢోకా లేనట్లే. ఇక ‘ఎఫ్-2’ సీక్వెల్ ‘ఎఫ్-3’కి సంబంధించిన పోస్టర్లలు చూస్తే ఈ విషయం మనకు బాగా అర్ధమౌతుంది. మెహ్రీన్ చాలా గ్లామరస్‌గానే కనిపిస్తోన్న కానీ కంటికి నిండుగా కనిపించదం లేదు అనేది అభిమానుల బాధ. మరి చూడాలి ఫ్యాన్స్ కోసం అమ్మడు బొద్దుగా మారుతుందా అనేది.