నాగ చైతన్య-సమంత గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా ఉన్న ఈ జంట.. ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేసారు.
అప్పటి నుండి ఎంతో ముచ్చట గా ఉన్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ జంట విడాకుల పై పలువురు సెలబ్రిటీలు రియాక్ట్ అవుతూ.. వాళ్ల లైఫ్ వాళ్ల ఇష్టం..మీడియా వాళ్లకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి అంటూ సలహాలు ఇస్తున్నారు.
ఇక నాగర్జున అయితే సమంత విడాకులు తీసుకున్న ఎప్పటికి నాకు క్లోజ్ గానే ఉంటుంది..సమంతతో గడిపిన మధురమైన క్షణాలను నేను ఎప్పటికి మర్చిపోలేను అంటూ పోస్ట్ చేసారు. అయితే విడాకుల తరువాత సమంత నాగచైతన్య వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు. నాగచైతన్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి దందడి చేస్తే.. సమంత యంగ్ టైగర్ తారక్ హోస్ట్ చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి వచ్చి గేం ఆడి తన అభిమానులకు మంచి ఎంటర్ టైన్ చేసింది.
ఈ క్రమంలో నాగచైతన్య గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. అదేమిటంటే..ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడట. యస్..నాగచ్ ఉండడం చైతుకి ఇష్టం లేదట. అందుకే కొన్నాళ్లపాటు సింగిల్ గా ఉండాలని ..హైదరాబాద్ లోని ఓ పోష్ ఏరియాలో కొత్త అపార్ట్మెంట్ తీసుకున్నారట. కొన్ని రోజుల్లో ఈ అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అవ్వనున్నారట చైతూ.