Moviesమా ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓటు వేయకపోవడానికి రీజన్ ఇదే..మంచు విష్ణు సంచలన...

మా ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓటు వేయకపోవడానికి రీజన్ ఇదే..మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..!!

దాదాపు మూడు నాలుగు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో వాగ్వాదాలు, మరెన్నో పరస్పర ఆరోపణలు, దూషణల నడుమ జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎన్నికల హడావిడికి ఆదివారం తెరపడింది . తెలుగు చిత్రసీమకు సంబంధించి మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేశారు. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై ఘనవిజయం సాధించారు.

దీంతో తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు మంచు విష్ణు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇక మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ..నాగబాబు,ప్రకాష్ రాజ్ రాజీనామాల పై స్పందిస్తూ ..నాగబాబు, ప్రకాష్ రాజ్ ల రాజీనామాలను స్వీకరించడం లేదని చెప్పారు. ప్రకాష్ రాజ్ గారి సలహాలు, పెద్దరికం ‘మా’కు అవసరమని అన్నారు.వాళ్లి ఇద్దరు నాకు కావాల్సిన వాళ్లని త్వరలోనే ఇద్దరినీ కలిసి వ్యక్తిగతంగా ఆ విషయాన్ని చెప్పి.. వాళ్ల సపోర్ట్ కావాలని కోరతానని చెప్పుకొచ్చారు.

ఇక యంగ్ టైగర్ తారక్ మా ఎన్నికల్లో ఓటు వేయకపోవడానికి గల కారణాల గురించి మాట్లాడుతూ.. ఆయన వ్యక్తిగత కారణాల వలన రాలేకపోయారని. అయినా నేను గెలిచిన వెంటనే ఫస్ట్ నాకు ఫోన్ చేసింది నా తమ్ముడు తారక్ అని చెప్పుతూ.. ఆయన సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉంటుందని” అని సమాధానమిచ్చారు. ఏదిఏమైనా మంచు విష్ణు మాట్లాడుతున్న స్టైల్ అందైని ఆకట్టుకుంటుంది. మాటల వరకు ఓకే కానీ ఇచ్చిన హామీలను సైతం నెరవేరిస్తేనే ఆయన సక్సెస్ అయ్యిన్నట్లు అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news