తాప్సీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితమే తెలుగులో హీరోయిన్గా పరిచయం అయ్యిన ఈ బ్యూటీ..ఇంకా టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో ఉందంటే ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ఆలోచించక్కర్లేదు. తెలుగులో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ అందాల భామ..కొన్ని సినిమాలు చేసి.. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే తాప్సీనే గుర్తుకు వస్తోంది.
‘పింక్’, ‘ముల్క్’,’బద్లా’ ‘గేమ్ ఓవర్’ సాండ్ కి ఆంఖ్ లాంటి వరుస హిట్ సినిమాలతో హిందీ పరిశ్రమలో దూసుకుపోతుంది తాప్సీ. ఇక తాప్సీ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే మరో నాలుగైదేళ్లు ఆమె కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. ఆమె నటిస్తోన్న సినిమాలతో పాటు ఒప్పుకున్న సినిమాల లిస్ట్ చూస్తే ఐదారు వరకు ఉన్నాయి. మిగిలిన భాషల కన్నా ఆమె బాలీవుడ్లోనే బిజీబిజీగా ఉంది. అయితే ఇటీవల విడుదలైన ‘రష్మీ రాకెట్’ చిత్రంలో అథ్లెట్‌గా తాప్సీ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా గురించిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు నచ్చిన క్రీడాకారులతో అవకాశం వస్తే డేటింగ్‌కు సై అంటుంది తాప్సీ. అంతేకాదు క్రీడాకారులతో డేటింగ్ చేస్తే తప్పేముంది అని కూడా ప్రశ్నిస్తుంది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్ ఆండీ ముర్రే నాకిష్టమైన టెన్నిస్ ఆటగాడు. అతనితో డేటింగ్‌కు అవకాశం వస్తే వదులుకోను’ అని తాప్సీ చెప్పారు. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..గతంలో ఓ సందర్భంలో సినీనటులతో డేటింగ్ తనకు అసలు ఇష్టంలేదని చెప్పింది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్ గా మారాయి.