టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరు అయిన సురేష్‌బాబు ఆల్‌రౌండర్. ఆయన నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, రామానాయుడు స్టూడియోస్ అధినేత. అలాంటి సురేష్‌బాబు తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి పేర్ని నానితో ఇండస్ట్రీ ప్రముఖుల సమావేశానికి రాలేదు. ఆ తర్వాత జరిగిన రెండు సమావేశాల్లోనూ ఆయన లేరు. ఇండస్ట్రీకే కీలకమైన సురేష్ బాబు.. ఈ కీలక సమావేశాలకు ఎందుకు రావడం లేదు.. ఏం జరిగింది ? అన్నది ఆసక్తికరమే..!
పరిశ్రమకు గతంలో ఏ కష్టం వచ్చినా.. పరిశ్రమ తరపున ఏదైనా నిర్వహించాలనుకున్నా ముందుగా నిలబడేది ఆయనే. అలాంటి సురేష్‌బాబు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారన్నదే ఆసక్తికరం. దీనిపై ఇన్నర్ వర్గాల టాక్ ప్రకారం జగన్ నేరుగా అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా మంత్రులను కలవడం ఆయనకు నచ్చలేదట. మంత్రులను ఎన్నిసార్లు కలిసినా ఉపయోగం ఉండదన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారంటున్నారు.
ఇక ఈ ఇష్యూలోకి సురేష్‌బాబు ఎంటర్ అయితే వైజాగ్‌లో ఉన్న రామానాయుడు స్టూడియో భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడు సురేష్‌బాబుకు తీరని నష్టం వాటిల్లుతుంది. అందుకే సురేష్ బాబు మౌనంగా ఉన్నారని కొంతమంది భావిస్తున్నారు. ఇక గతంలో చిరంజీవి, నాగార్జునతో కలిసి సురేష్‌బాబు జగన్‌ను కలిశారు.
అప్పుడు సినిమా పరిశ్రమను ఆదుకుంటానని జగన్ హామీ ఇచ్చినా కూడా పెద్దగా ఉపయోగం లేదని.. ఇప్పుడు కూడా అంతకు మించి కొత్తగా ఒరిగేదేం ఉండదని భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు ఈ సమావేశాలకు ఆయన దూరందూరంగా ఉంటున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.