అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మూడున్నర దశాబ్దాలుగా తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. నాగ్ ఇద్దరు తనయులు నాగచైతన్య, అఖిల్ సైతం ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా మూడో తరం హీరోలుగా కొనసాగుతున్నారు. నాగార్జున 1987లో విక్రమ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అదే యేడాది ఆయన కెప్టెన్ నాగార్జున సినిమా కూడా చేశాడు. నాగ్ సినిమాల్లోకి రావడానికి ముందే 1984లో దగ్గుబాటి వెంకటేష్ సోదరి శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నాగచైతన్య పుట్టాడు.
తర్వాత మనస్పర్థలు రావడతో వీరు విడిపోయారు. అనంతరం తనతో కలిసి శివ, నిర్ణయం లాంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అమలను నాగ్ పెళ్లి చేసుకున్నాడు. నాగ్ అమలను పెళ్లి చేసుకునే విషయంలో నాగేశ్వరరావు అసలు ఒప్పుకోలేదట. చివరకు కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే ఏఎన్నార్ బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చిందట. వీరికి 1992లో అఖిల్ పుట్టాడు.
పెళ్లి అయిన కొత్తలో వీరి మధ్య కేవలం ఫుడ్ విషయంలో ఎక్కువుగా గొడవలు జరిగేవట. వినడానికి కామెడీగా ఉన్నా ఇది నిజం. అమలే స్వయంగా పలు సందర్భాల్లో ఈ విషయం చెప్పారు. నాగార్జునకు నాన్ వెజ్ చాలా ఇష్టం. అమలకు అస్సలు ఇష్టం ఉండదు. ఆమె బ్లూ క్రాస్ సొసైటీలో కీలక బాధ్యతలు చూసేవారు. ఆమె జీవహింసకు వ్యతిరేకం కావడంతో పాటు నాన్ వెజ్ కూడా తినడానికి ఇష్టపడరు. అయితే నాగార్జునకు నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదట.
అమల బలవంతంం చేయడంతో కొద్ది రోజులు నాగ్ వెజిటేరియన్‌గా నటించాడట. తర్వాత అమలతోనే బలవంతంగా నాన్ వెజ్ వండించేవాడట. ఇది నచ్చని అమల నాగ్‌తో ఎన్నోసార్లు గొడవ పడిందట.