సమంత ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో ఎలా ? వైరల్ అవుతుందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌కు మెయిన్ పిల్లర్ లాంటి అక్కినేని ఫ్యామిలీ ఇంట కోడలిగా అడుగు పెట్టిన సమంత నాలుగేళ్లకే చైతుకు విడాకులు ఇచ్చి బయటకు వచ్చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. సమంత వ్యక్తిగత జీవితం మరీ అంతా క్లీన్ కాదు. అంతకు ముందే ఆమెకు మరో హీరో సిద్ధార్థ్‌తో పాటు తెలుగులోనే ఓ స్టార్ డైరెక్టర్‌తో నూ ఎఫైర్లు ఉన్నాయన్న ప్రచారం గట్టిగానే జరిగింది.
తెలుగులో నందమూరి, అక్కినేని కాంపౌండ్‌లో కోడళ్లుగా అడుగు పెట్టిన వారు చాలా సాంప్రదాయంగా ఉండాలనే ఆ ఫ్యామిలీ అభిమానులు కోరుకుంటారు. అయితే సమంత ఇందుకు భిన్నంగా పెళ్లయ్యాక కూడా హాట్ డ్రెస్సులు వేసుకుని పార్టీలకు, ఫంక్షన్లకు వచ్చేది. ఇక అంతే హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. చివరకు సినిమాలు, వెబ్ సీరిస్లలోనూ అంతే బోల్డ్‌గా ఉండేది.
వీటితో పాటు సమంత తన ప్యాషన్ డిజైనర్‌తో ప్రేమలో ఉందని.. అది కూడా చైతుకు దూరం కావడానికి ఓ కారణమని అంటున్నారు. సమంతకు పర్సనల్ డిజైనర్ గా ఉన్న ప్రీతమ్ జుకాల్కర్ తో సమంత ప్రేమలో ఉందని వార్త తెలియడంతో వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని మరో టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. గతంలో ఆమె ప్రీతమ్‌తో ఏకాంతంగా ఉండడంతో పాటు సోఫాపై పడుకుని అతడి ఒడిలో తన కాళ్లు పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే వెంటనే దానిని డిలీట్ కూడా చేసింది.
అప్పుడే చాలా మందికి అనుమానాలు వచ్చాయి. అయితే చైతు పుట్టిన రోజు సందర్భంగా మా ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అని చెప్పింది. అయితే ఇప్పుడు చైతుకు దూరం కావడానికి కారణం త్వరలోనే డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ పెళ్లి చేసుకునేందుకే అని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు త్వరలోనే బయటకు రానున్నాయి.