Moviesచైతన్య కు దిమ్మతిరిగే షాకిచ్చిన సమంత..వార్ మొదలైందా..?

చైతన్య కు దిమ్మతిరిగే షాకిచ్చిన సమంత..వార్ మొదలైందా..?

సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత తన పనీ తాను చేసుకుంటూపోతుంది. ఇక ఆ విడాకుల వ్యవహారం నుండి బయటపడటానికి వరుసగా సినిమాలు కమిట్ అవుతూ..కెరీర్ బిజీ గా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటుంది. అయితే వీళ్లు విడాకులు తీసుకుని దాదపు నెల రోజులు కావస్తున్న వీరి పై మాత్రం గాసిప్స్ ఆగడంలేదు. సమంత నాగ చైతన్య ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ఇంకా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీళ్లు మాత్రం అవేమి పట్టించుకోకుండా..సినిమాలు చేసుకుంటున్నారు.

విడాకులు తరువాత స‌మంత త‌న ఆ పెళ్లి జ్ఞాపకాలను శాశ్వతంగా మరిచిపోయేందుకు తీర్థ‌యాత్ర‌ల‌కు వెళుతుండ‌గా..ఇక చైతూ మాత్రం అసలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అయితే సమంత మాత్రం సోసహల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.కాగా తాజాగా అందుతున్న సమాచారం బట్టి.. విడాకుల ప్రకటన తర్వాత సామ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి అక్కినేని నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలిట్ చేసిందట.

ఒక్కటి కాదు రెంటు కాదు ఏకంగా 80 పై ఫోటోలను తొలగించినట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫోటోలు అలాగే పెట్ డాగ్స్ తో ఉన్న ఫొటోలను మాత్రమే ఉంచిందట. ఇద్ద‌రు కలిసి ఉన్న ఫోటోలను మాత్రమే తొల‌గిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే రానున్న రోజుల‌లో ఫొటోలు మొత్తం డిలీట్ చేశాక.. నాగచైతన్య ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తుందని అంటున్నారు పలువురు నెటిజన్లు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news