అయ్యిపోయింది.. అంతా అయిపోయింది.. కోట్లా మంది ప్రజలు పెట్టుకున్న కలలు చెదిరిపోయాయి. ఎంతో ఉత్కంఠ్ భరితంగా సాగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో పాక్ సరికొత్త చరిత్ర సృష్టించింది. విశ్వవేదికపై టీమ్‌ఇండియాను ఓడించాలనుకున్న పాకిస్థాన్ చిరకాల స్వప్నం ఇన్ని సంవత్సరాలకు నెరవేరింది. వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో కలిపి ఇప్పటి వరకు భారత్ చేతిలో 12 సార్లు ఓడిన పాక్ పదమూడో ప్రయత్నంలో ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో నిన్న్ జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చెందింది. భారత్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ఇంకా 13 బంతులు మిగిలి ఉండగానే సునాసయంగా ఛేదించింది. దాయాదులపోరులో పాకిస్తాన్ సాధించిన విజయంతో టీమ్ ఇండియా రికార్డు బ్రేక్ అయింది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చరిత్ర తిరగరాసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇండియాపై తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ భారీ స్కోరు నమోదు చేయడంలో విఫలమయ్యారు. అతి తక్కువ స్కోరుకే రెండు వికెట్లు కోల్పోవడం పట్ల ఇండియా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ ఔట్ అవుట్ కావడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతలను కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భుజాలపై వేసుకున్నారు.
అయితే ఇక్కడ మరో హాట్ మ్యాటర్ లీక్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ప్రత్యేకంగా ఈ మెగా టోర్నీ కోసమే మహేంద్ర సింగ్ ధోనీని టీమిండియా మెంటార్‌గా నియమించింది బీసీసీఐ. అతడు ఫీల్డ్‌లో లేకపోయినా.. అతడు ఇచ్చే సలహాలు, సూచనలు టీమ్‌కు ఎంతగానో పనికొస్తాయని బోర్డు భావించింది.
అందుకు తగినట్లే టీమిండియా ఫీల్డింగ్, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీ .. ఎప్పుడు కాస్త సమయం దొరికినా.. వాటర్ బాటిల్స్ లేదంటే బ్యాట్లు పట్టుకొని ఫీల్డ్‌లోకి పరుగెత్తుకొచ్చిన ఇషాన్ కిషన్.. ధోనీ సందేశాన్ని విరాట్‌కు చేరవేసే ప్రయత్నం చేశాడు. అయితే కోహ్లి మాత్రం వాటిని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలకే కట్టుబడి తన సొంత నిర్ణయాలతోనే ఈ మ్యాచ్ ని చేతులారా ఓడిపోయేలా చేసుకున్నాడంటూ మాటలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి కోహ్లీ దీనికి ఆన్సర్ ఇస్తారో లేదో..?