Moviesవారెవ్వా.. బంపర్ ఆఫర్ కొట్టేసిన 'పెళ్లి సందD' హీరోయిన్..మెగా హీరో కి...

వారెవ్వా.. బంపర్ ఆఫర్ కొట్టేసిన ‘పెళ్లి సందD’ హీరోయిన్..మెగా హీరో కి జోడీగా శ్రీలీల..?

అదృష్టం..ఎప్పుడు..ఎవరిని.. ఎలా.. వరిస్తుందో మనం చెప్పలేం. ఎవరి దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో అసలకి చెప్పలేం. అలాంటి దానికి బెస్ట్ ఉదాహరణ.. ఈ సొట్ట బుగ్గల సుందరి శ్రీలీల. అదేనండి ‘పెళ్లి సందడ్’ హీరోయిన్. ‘పెళ్లి సందడ్’ అనే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయి.. టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఈమె పేరుకూడా తెలియదు. కానీ, ఈ సినిమా తరువాత..ఈమె దర్శక నిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది.

శ్రీకంత్ కొడుకు హీరోగా తెర‌కెక్కిన ‘పెళ్లి సందD’ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ శ్రీలీల. . ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. హీరో హీరోయిన్స్ ఇద్దరూ కూడా మొదటి సినిమాతోనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. త‌న మొద‌టి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చేసిన మొదటి సినిమాతోనే ఆడియన్స్‌‌ని మేస్మైరైజ్ చేసింది ఈ భామ . కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్నది శ్రిలీల. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఈ అమ్మాయి పైన పడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ శ్రీలీల కు వరుస ఆఫర్లు వస్తున్నాయట.

ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల ఐదారు సినిమాలకు సంబంధించి చర్చలు జరుపుతోందట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్రది మెగా కాంపౌండ్ లోకి అడుగుపెడుతుందని టాక్ వినిపిస్తుంది. త్వరలో శ్రీలీల ఓ మెగా హీరో సరసన నటించనుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి మెగా ఫ్యామిలీలో ఏ హీరోతో శ్రీలీల జతకట్టనుంది అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలు కాని హిట్ అయితే ఈ అమ్మడికి స్టార్ డమ్ రావడం పక్కా అనే చెప్పాలి. మరి చూడాలి ఏం జరుగుతుందో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news