ప్రస్తుతం తెలుగు మీడియాలోనూ, సినీ రంగంలోనూ మంచు ఫ్యామిలీ హాట్ టాపిక్‌గా మారింది. మంచు మోహన్ బాబు వారసుడు మంచు విష్ణు మా ఎన్నికల బరిలో ఉన్నాడు. మా అధ్యక్ష పదవికి ప్రకాష్‌రాజ్‌తో విష్ణు పోటీ పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇక్కడ కులాల ప్రస్తావన కూడా వస్తోంది. ఓ కులం విష్ణుకు సపోర్ట్ చేస్తుంటే… మరో కులం ప్రకాష్‌రాజ్‌కు సపోర్ట్ చేస్తుందన్న చర్చలు నడుస్తున్నాయి.
ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీలో ఎన్ని కులాలు ఉన్నాయి ? ఏ కులం వారు ఆ ఇంటితో రిలేషన్ కలిగి ఉన్నారన్నది చూస్తే ఆసక్తికరమే. మోహన్‌బాబు తన మరదలినే వివాహం చేసుకున్నారు. కమ్మ వర్గానికి చెందిన మోహన్‌బాబు ఇద్దరు వారసులు, కుమార్తె మాత్రం కులాంతర వివాహాలే చేసుకున్నారు. విష్ణు భార్య వెరోనికా రెడ్డి వర్గానికి చెందిన అమ్మాయి.
ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న కుమార్తే వెరినిక. ఇక మనోజ్ మాజీ భార్య ప్రతణి రెడ్డి కూడా రెడ్డి వర్గం అమ్మాయే. అయితే ప్రణతి – మనోజ్ యేడాది క్రిందటే విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న కూడా కులాంతర వివాహమే చేసుకున్నారు. లక్ష్మీ ప్రసన్న భర్త బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి. ఇలా మోహన్ బాబు ఫ్యామిలీ లో వారసులు అందరూ కులాంతర వివాహాలే చేసుకున్నారు.