తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొద్ది రోజులుగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సినిమా హాళ్ల టికెట్ల విక్రయంలో ఆన్ లైన్ విధానం తీసుకువచ్చే అంశంపై ఏపి సర్కార్, వర్సెస్ పవన్ కల్యాణ్ గా వివాదం చెలరేగుతోంది. ఓ వైపు పొలిటికల్ గా సెటైర్లు వేస్తూనే సినిమా ఇండస్ట్రీ సమస్యలను లేవెనెత్తుతూ ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు పవన్.
ఏపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై టాలీవుడ్ పెద్దలు అందరూ కలిసి ఏపి ప్రభుత్వంపై పోరాటం చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దిల్ రాజు నేతృత్వంలో పలువురు నిర్మాతలు ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి పవన్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం.. ఆ వ్యాఖ్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. సినిమా నిర్మాతలు మాత్రం పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా.. స్వయంగా ఏపీ ప్రభుత్వ పెద్దలను కలిసి తమ కష్టాలను చెప్పుకోని.. ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ఇక పేర్నినాని భేటి తర్వాత పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం ..నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీరెడ్డి, నారంగ్, బన్నీ వాసులు శుక్రవారం హైదరాబాద్ లో పవన్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలోని పలు సమస్యలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకునే విషయమై నిర్మాతలు పవన్ కల్యాణ్ తో చర్చించినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. వారి మధ్య సృహృద్బావ వాతావరణంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ గార్ని ఈ రోజు ఉదయం ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య,నవీన్ ఎర్నేని,వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రపరిశ్రమకు సంభందించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయి @PawanKalyan pic.twitter.com/EUzLxKiJhY
— BA Raju’s Team (@baraju_SuperHit) October 1, 2021