రష్మిక మందన.. ఓ వైపు టాలీవుడ్..ఓ వైపు బాలీవుడ్..మధ్యలో కోలీవుడ్ అన్నీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉంది. ప్రస్తుతం తెలుగులోనే కాక నేషనల్ వైడ్‌గా స్టార్ హీరోయిన్ గా తన సత్త చాటుతున్న భామ రష్మిక అనే చెప్పాలి. టాలీవుడ్ లో రోజుకో హీరోయిన్ పుట్టుకొస్తున్నా కానీ ఈ అందాల ముద్దుగుమ్మ ప్లేస్ ని మాత్రం రీప్లేస్ చేయలేకపోతున్నారు. తన క్యూట్ క్యూట్ లూక్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రష్మిక.
ఈ సౌత్ ఇండియన్ స్టార్ కు ఇన్ స్టా గ్రాంలో 21 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇది ఆమెకున్న ఫాన్ ఫాలోయింగ్ ను క్రేజ్ ను తెలుపుతుంది. ఫోర్బ్స్ భారతదేశంలో ‘అత్యంత ప్రభావవంతమైన నటుల’ జాబితాలో నటి రష్మిక మందన్నా అగ్రస్థానం సంపాదించింది. సమంత, విజయ్ దేవరకొండ, యష్, అల్లు అర్జున్ వంటి హేమహేమీలను దాటుకుంటూ టాప్‌కి చేరింది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్ నెస్ కోసం టైమ్ కేటాయిస్తుంది రష్మిక . తన శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచడం కోసం వారానికి కనీసం 4,5 సార్లు జిమ్ లో గడుపుతుందట ఈ కన్నడ బ్యూటీ. ఇక ఆ వర్కవుట్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులను ఉత్సాహపరుస్తుంటుంది.
రష్మిక గ్లామర్‌తో పాటు ఫిట్నెస్లోను అదరగొడుతుందనే విషయం మనకు తెలిసిందే. తాజాగా తన ఇన్‌స్టాలో పెట్టిన ఓవీడియో చూస్తే రష్మిక తన పాత్రలో కోసం ఎంతగా కష్టపడుతుందనేది అర్ధమవుతుంది. తన ట్రైనీ తో కిక్ బ్యాగ్ పై సాలిడ్ పంచ్ లు ఇస్తూ గట్టిగా కష్టపడుతుంది. అందులో రష్మిక తన ఫిట్నెస్ ట్రైనర్ పట్టుకున్న స్ట్రైకింగ్ ప్యాడ్‌ను పదేపదే తన్నుతున్నట్లు చూడొచ్చు. ఆమె ఎగిరెగిరి తన్నుతుంటే..మరింత గట్టిగా తన్ను అంటూ రష్మికను ప్రోత్సహిస్తున్నాడు ట్రైనర్. దీనితో ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతుంది. ఇదంతా బన్నీ పుష్ప సినిమా కోసమా లేదంటే బాలీవుడ్ చిత్రాల కోసమా అనేది తెలియాల్సి ఉంది.
View this post on Instagram