నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు కంప్లీట్ చేసిన గోపీచంద్ మలినేని .. నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడనే టాక్ వినిపిస్తుంది.నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు ఈ సినిమాను రూపొందించడానికి కథను సిద్ధం చేశారు.
పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక చరిత్రకారుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న రోల్స్ చేస్తున్నారు. ఒకటి ఫ్యాక్షనిట్ గా మాస్ లుక్ లో కనిపించనుండగా.. మరోకటి యంగ్ లవర్ బాయ్ గా తన లుక్స్ తో ధియేటర్స్ లో అభిమానుల దగ్గర అరుపులు పెట్టించడాని రెడి అవుతున్నాడు బాలయ్య.
కాగా తాజా సమాచారం మేరకు ఈ చిత్రానికి డైరెక్టర్ గోపిచంద్ మల్లినేని ‘జై బాలయ్య’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించబోయే హీరోయిన్‌పై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందనే విషయం నందమూరి అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న అఖండ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది.