జైలు జీవితం గడపడం చాలా కష్టం. ఆ జైలు జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్యులే జైలు జీవితాని గడపడానికి నానాతంటలు పడుతుంటారు. అలాంటిది స్టార్ సెలబ్రిటీస్ జైలు కు వెళ్లితే..??
ఆ చిప్ప కూడు తినాల్సి వస్తే..?? ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా..? అయితే అలాంటి జీవితానే గడిపారు కొందరు సేఆత్ హీరోలు,హీరోయిన్ లు. అనుకోని పరిస్ధితిల్లో అలా జైలు జీవితం అనుభవించిన స్టార్ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..!!
సల్మాన్ ఖాన్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్ కోర్ట్ ఆయనకు ఐదేళ్ల శిక్ష విధించింది. అయితే ఈ కేసులో సల్మాన్ ఖాన్ కొన్ని నెలలు జైలు జీవితం గడిపారు. మొదట ఆయన్ను ఉంచింది ఆర్థర్ రోడ్ జైలులోనే.
సంజయ్ దత్: బాలీవుడ్ కల్ నాయక్ సంజయ్ దత్ 1993 లో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కేసులో జైలు శిక్ష అనుభవించారు. 1993వ సంవత్సరంలో ముంబై సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో ఇతడికి కూడా సంబంధం ఉందని.. అభియోగం రావడం సంజయ్ దత్ కూడా జైలు శిక్ష అనుభవించారు.
అక్షయ్ కుమార్ :బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా జైలు పాలయ్యాడు. లాక్మే ఫ్యాషన్ వీక్ లో అందరిముందు అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా అక్షయ్ కుమార్ జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత బైల్ దొరకడంతో విడుదలయ్యారు.
సోనాలి బింద్రే: స్టార్ హీరోయిన్ గా కుర్రకారుని నిద్రపోకుండా చేసిన ఈ భామ ..ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ వివాదంలో ఒక మతాన్ని కించపరిచిన కారణంగా సోనాలి బింద్రే జైలు పాలు అయింది. అయితే బెయిల్ పై విడుదలై బయటకు వచ్చింది.
శ్వేతా బసు ప్రసాద్: కొత్త బంగారులోకం సినిమాతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ కూడా జైలు జీవితాని గడిపింది. వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కైన ఈ అమ్మడు జైల్లు లో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపింది.
రియా చక్రవర్తి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, అతనికి డ్రగ్స్ సరఫరా చేసిన పలువురు డ్రగ్ పెడ్లర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అందులో రియా చక్రవర్తి పేరు కూడా ఉండడంతో సెప్టెంబర్ 7వ తేదీన ఎన్సిబి ఈమెను విచారించి ఒక నెల పాటు జైలు శిక్ష విధించింది.
రాజ్ కుంద్రా: అశ్లీల చిత్రాలను నిర్మించి, ముంబై యాప్స్ లో పబ్లిష్ చేశారని అభియోగం వల్ల ఇతడిని అరెస్ట్ చేయడం జరిగింది. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి, బెయిల్ మంజూరయ్యేంత వరకు రెండు నెలల పాటు ఆర్థర్ రోడ్ జైలులో ఉంచారు. ఇంకా చాలా మంది ప్రముఖులైన సెలబ్రిటీలు దారుణమైనటువంటి జైలు జీవితాని గడిపారు. కొంత మంది బెయిల్‌పై విడుదలైయితే…మరికొంత మంది నెలలు పాటు జైలులో చిప్ప కూడు తిన్నారు.