సినిమా వాళ్లు కలుస్తారు.. త్వరగా విడిపోతారు అన్న నానుడిని మరోసారి నిజం చేశారు అక్కినేని నాగచైతన్య – స్టార్ హీరోయిన్ సమంత. నాలుగేళ్లకే వీరి బంధం తెగిపోయింది. సమంత కేవలం కెరీర్ కోసమే ఈ బంధాన్ని తెంచేసుకుందని అంటున్నారు. ఓ బిడ్డకు జన్మనిచ్చి.. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయాలని అక్కినేని ఫ్యామిలీ చెప్పినా కూడా ఆమె వినడం లేదని.. చివరకు అబార్షన్ చేయించుకోవడంతో పెద్ద దుమారం చెలరేగి చివరకు వారు విడాకులు తీసుకునే వరకు వెళ్లిందంటున్నారు.
ఇక చైతుకు విడాకులు ఇచ్చిన సమంత ఇప్పుడు వరుసగా బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలపై కాన్‌సంట్రేషన్ చేసే పనిలో ఉంది. మళ్లీ తాను పాన్ ఇండియా సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా కొంత కాలం ఓ వెలుగు వెలగాలన్న తాపత్రయం ఆమెలో ఎక్కువుగా కనిపిస్తోందట. ప్రస్తుతం ఆమె నటించిన శాకుంతలంలో పాటు కోలీవుడ్‌లో విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసే సినిమాతో పాటు ఒకటీ అరా ఉన్నాయి.
అయితే ఇప్పటికిప్పుడు ఆమెకు పెద్ద ప్రాజెక్టులలో ఛాన్సులు వస్తాయా ? అన్నది చూడాలి. అయితే సమంత చుట్టూ ఉండే ఆడ స్నేహితుల రాడికల్ భావాల వల్లే సమంత ప్రభావితం అయ్యిందని అంటున్నారు. ఆ ఆడ స్నేహితులు మరీ ఓవర్ స్వేచ్ఛ తీసుకునేలా సమంతపై ఒత్తిడి చేయడంతో పాటు సమంతను రాంగ్ ట్రాక్ పట్టించారని తెలుస్తోంది. అదే చివరకు విడాకులకు కారణమైందంటున్నారు.