టాలీవుడ్లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా స్టార్ బ్యూటీల లెక్కే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా కొంతకాలం స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేసిన బ్యూటీలు ఫాం కోల్పోయినవెంటనే ఫేడ్ అవుట్ అయిపోతారు. కానీ తెలుగులో దశాబ్ధ కాలంగా స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న బ్యూటీలు కొందరు ఉన్నారు. వీరిలో అందాల చందమామ కాజల్ కూడా ఒకరు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 13 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్ గానే రాణిస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.
లాక్ డౌన్ లో చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకున్న యాక్టర్ల లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలుతున్న కాజల్ అగర్వాల్ గతేడాది ప్రముఖ బిజినెస్ మాన్ గౌతమ్ కిచ్లూ ను ప్రేమ వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత కూడా వరుసగా ప్రాజెక్టులతో బిజీ గా ఉన్న కాజల్ అగర్వాల్ త్వరలో తల్లికాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గౌతమ్ కిచ్లుతో వివాహం జరిగిన తర్వాత కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందని కొద్ది నెలల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ వాటిని కొట్టివేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వైరల్ అవుతున్నాయి.
దీనికి తోడు కాజల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ముఖ్యమైన అనౌన్స్మెంట్ త్వరలో వస్తుంది.. వేచి ఉండండి’ అని పేర్కొన్నారు. దాంతో ఈ అనౌన్స్మెంట్ దేని గురించోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా లవ్ సింబల్ తో పాటు డాన్స్ చేస్తున్న ఎమోజీ ని కూడా జత చేసింది. దీంతో అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది అంటున్నారు సినీ ప్రముఖులు. మరి చూడాలి ఆ వార్త ఏంటో..??