Moviesఏంటి..ఇలాగేనా బిడ్డను పెంచేది..స్టార్ హీరోయిన్ పై చిరంజీవి ఫైర్..!!

ఏంటి..ఇలాగేనా బిడ్డను పెంచేది..స్టార్ హీరోయిన్ పై చిరంజీవి ఫైర్..!!

టాలీవుడ్ లెజండ్ దర్శకుడు రాఘవేంద్ర రావు ఎన్నో అద్భుతమైన సినిమాలని తెరకెక్కించారు. అందులో వన్ ఆఫ్ ది బ్లాక్‌బస్టర్ మూవీ ‘పెళ్లి సందడి’. ఈ సినిమా సరిగ్గా 25 సంవత్సరాల క్రితం శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలో.. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఆ సినిమాలోని పాటలు జనాలను అలరిస్తూనే ఉన్నాయి.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమాని ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ‘పెళ్లి సందD’ అంటూ మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో.. గౌరీ రోనంకి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇక మొదటి సినిమాలో హీరోగా నటించిన శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా.. కొత్త అమ్మాయి శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ తరం ‘పెళ్లి సందడ్’ అక్టోబర్ 15వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు (అక్టోబర్ 10) గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన చిరంజీవి, వెంకటేష్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. శ్రీకాంత్ నాకు తమ్ముడు లాంటి వాడు. ఇక తమ్ముడు కొడుకు రోషన్ నన్ను పెదనాన్న అని ఆప్యాయంగా పిలిచేవాడు.కానీ, మొట్టమొదటి సారి ఇప్పుడు ఇక్కాద స్టేజిపైన చిరంజీవి గారు అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు. ఈ పద్దతి ఏం బాగోలేదు. నేను నీ పెద నాన్నని. నన్ను అలాగే పిలువు. ఇక ఈ విషయమై చిరంజీవి శ్రీకాంత్ భార్య ఊహను అడుగుతూ… “ఇదేనా నీ పెంపకం. నా కొడుకు నన్ను పెదనాన్న అని పిలవ కుండా..చిరంజీవి గారు అంటున్నారు”.. అంటూ నవ్వుతూ కసిరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news