Movies"మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు"..సమంత పై రీవేంజ్ తీర్చుకున్న సిద్దార్ధ్..??

“మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు”..సమంత పై రీవేంజ్ తీర్చుకున్న సిద్దార్ధ్..??

అందరు అనుకున్నదే జరిగింది. గత కొన్ని రోజులుగా అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య..కోడలు పిల్ల సమంత విడాలుకు తీసుకుంటున్నారంటూ టోటల్ మీడియా కోడై కూసింది. ఇక నిప్పు లేనిదే పోగ రాదు అంటూ ప్రూవ్ చేసారు చై సమంత. మీడియా లో వచ్చిన వార్తలను నిజం చేస్తూ.. తమ వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పెట్టేసారు. పదేళ్ల స్నేహ బంధం..4 ఏళ్ల వివాహ బంధం.. కోట్లాది మంది అభిమానులు ఆశీసులులు అన్నీ మటలో కలిసిపోయాయి. యంగ్ హీరో నాగ చైత‌న్య‌, స‌మంత‌లు వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు.

నాగ చైతన్య తన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ..”ఎవరి దారిలో వాళ్లం నడవాలనుకుంటున్నాం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం అని నాగచైతన్య ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎమోషనల్‌ పోస్ట్ అభిమానులతో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఈ ఇష్యూ పై పెట్టాడో లేక అలా సింక్ అయ్యిందో తెలియదు కానీ సమంత మాజీ లవర్ హీరో సిద్దార్ధ్ ఓ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

 

ఇంతకి ఆ ట్వీట్ లో ఏం ఉందంటే..“మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే…. మరి మీరేం నేర్చుకున్నారు..? ” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ సిద్దార్థ్ ఎవరి గురించి వేశాడా అనే చర్చ జరుగుతోంది. నెటిజన్లు మాత్రం ఇది సమంత కోసమే పెట్టాడంటున్నారు. గతంలో వీళ్ళు లవ్ లో ఉన్నారని.. పెళ్ళి పీఠలు కూడా ఎక్కబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే సడెన్ గా సమంత సిద్ధూ కి హ్యాండ్ ఇచ్హి చైతూ ని చేసుకుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news