మా ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ గా మారింది. గెలుపుపై అటు మంచు విష్ణు ఫ్యానెల్ తో పాటు ఇటు ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ రెండూ ధీమాగానే ఉన్నాయి. జూబ్లి హిల్స్ పబ్లిక్ స్కూళ్లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే పోలింగ్ శాతం గతం కంటే ఎక్కువుగా జరగడంతో మధ్యాహ్నం 3 గంట ల వరకు పోలింగ్ కొనసాగేందుకు అనుమతి ఇచ్చారు. అయితే సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని ముందుగా అనుకున్నారు. అయితే ఎన్నికల ప్రక్రియను త్వరగా ముగించాలన్న కారణంతో కేవలం 30 నిమిషాలు మాత్రమే గ్యాప్ తీసుకుని 4 గంటలకే ఓట్ల లెక్కింపును చేపట్టేశారు.
ఓ వైపు ఓట్ల లెక్కింపు జరుగుతుం డగానే ప్రకాష్ రాజ్ కు ఎన్నికల అధికారికి గొడవ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు లో ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక శివబాలాజీ అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే నిమ్స్‌కు తరలించారు. అయితే హేమ పంటి కాటుతో విషం కారణంగానే శివబాలాజీ అస్వస్థతకు గురయ్యారంటూ జోకులు వేస్తున్నారు. ఉదయం హేమ శివబాలాజీ చేతిని కొరికిన సంగతి తెలిసిందే. మరోవైపు కొందరు హేమను విషకన్యగా పోలుస్తూ మీమ్స్ చేస్తున్నారు.