మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా రిపబ్లిక్. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ పవర్ ఫుల్ లేడీ పొలిటికల్ లీడర్ పాత్రలో నటించింది. విలక్షణ దర్శకుడు దేవ కట్టా దర్శకత్వం వహించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తెరకెక్కిన ఈ సినిమాలో కావాల్సినన్ని సామాజిక అంశాలు ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా మరీ లాభాలు తీసుకువస్తుందా ? లేదా ? అన్నది పక్కన పెడితే విమర్శకులు మాత్రం సినిమాను ప్రశంసిస్తున్నారు. మరోవైపు సాయితేజ్‌కు యాక్సిడెంట్ కావడంతో ఎవరికి వారు ఈ సినిమాను తమ వంతుగా ప్రమోట్ చేస్తున్నారు.
తాజాగా రిపబ్లిక్ సినిమాపై టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. రిపబ్లిక్ సినిమా రిలీజ్ అయ్యాక గ్రేట్ రివ్యూస్ తాను వింటున్నానని.. దర్శకుడు దేవా కట్టా, సాయిధరమ్ తేజ్ అద్భుతమైన వర్క్ గురించి చాలా మంది చెపుతున్నారని.. తాను వీలు చూసుకుని ఈ సినిమా చూస్తానని లోకేష్ ట్వీట్ చేశారు. ఏదేమైనా పొలిటికల్ లీడర్స్‌కు కూడా ఈ సినిమా రీజ్ అవుతుంది ? అంటే రిపబ్లిక్ ఇంఫాక్ట్ బాగానే ఉందనే అనుకోవాలి.
Hearing some great reviews about #RepublicMovie. Looking forward to watch @devakatta and @iamsaidharamtej’s phenomenal work soon. Wishing Tej a speedy recovery and good health! #REPUBLIC pic.twitter.com/6KahQSnA8c
— Lokesh Nara (@naralokesh) October 3, 2021