ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు భారీ అంచనాలతో షూటింగ్ ప్రారంభమైనా రిలీజ్కు నోచుకోకుండా ఉంటాయి. కొన్ని సినిమాలు ఏకంగా ఆరేడేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంటాయి. ఇక బాలకృష్ణ నటించిన విక్రమసింహ భూపతి సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రారంభమై పదిహేనేళ్లు అవుతున్నా ఇప్పటకి రిలీజ్ కాలేదు. ఇక బాలయ్య స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన నర్తనశాల కూడా కొంత షూటింగ్ జరుపుకున్నా ఆ సినిమాలో హీరోయిన్గా చేసిన సౌందర్య మరణంతో ఆగిపోయింది.
ఇక అంతకన్నా ముందు బాలయ్య , ఆయన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఓ సినిమా కూడా రిలీజ్కు నోచుకోలేదు. ఆ సినిమా పేరు కంచు కాగడా. ఉప్పలపాటి విశ్వేశ్వర్రావు బాలయ్య హీరోగా ఓ భారీ జనపద చిత్రం ప్లాన్ చేశారు. జమున హీరోయిన్, ఎన్టీఆర్ – కాంతారావు పై కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు. అయితే అప్పుడు జమున గర్భవతి కావడంతో ఆమె ప్రసవించాక ఆ సినిమాను ఫినిష్ చేయాలని అనుకున్నారు.
ఆ తర్వాత ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ హీరో చనిపోవడంతో ఈ సినిమా త్వరగా పట్టాలు ఎక్కలేదు. తర్వాత ఈ సినిమా కృష్ణ చేయాలని అనుకున్నారు. కుదర్లేదు.. చివరకు బాలయ్యతో అయినా ఈ సినిమా పూర్తి చేయించాలని అనుకున్నా ఈ సినిమా తిరిగి పట్టాలు ఎక్కలేదు.