వెండితెరపై కపుల్‌గా నటించి రియల్ లైఫ్‌లో జంటగా మారిన నాగచైతన్య-సమంత పెద్ద సెన్షేషనల్ జంట అయిపోయారు. సౌత్ ఇండియాలోనే కాదు హోల్ ఇండియాలోనే వీరిద్దరి ప్రేమ వివాహం ట్రెండ్ అయ్యింది. వీరిద్దరి కాంబోలో నాలుగు సినిమాలు కూడా వచ్చాయి. తొలి సినిమా ఏమాయ చేశావే టైం నుంచే వీరి మధ్య చిగురించిన ప్రేమ కాస్తా వీరు పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. ఇక కొద్ది రోజులుగా వీరి మధ్య గ్యాప్ ఏర్పడిందని.. అది చివరకు వీరు విడిపోయే వరకు వచ్చేసిందన్న ప్రచారం జరుగుతోంది.
తమ విడాకుల వార్తలపై ఈ జంట స్పందించక పోవడం కూడా వీరు విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలకు మరింత బలం ఇచ్చేలా ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోవాలనుకుంటోంది ? అసలు అందుకు బలమైన కారణాలు ఏంటన్నదానిపై ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల లీకులు, చర్చలు నడుస్తున్నాయి.
సమంతపై అక్కినేని ఫ్యామిలీ ఆంక్షలు ఎక్కువ అవ్వడం.. ఈ విషయంలో చైతు సమంతకు ఔననీ.. కాదని చెప్పలేకపోవడం తో ఏర్పడిన గ్యాప్ క్రమంగా పెరిగిపోయిందట. సామ్ డ్రెస్సుల విషయంలో అక్కినేని ఫ్యామిలీ బాగా ఆంక్షలు పెట్టిందని అంటున్నారు. చైతుతో పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కావచ్చు.. బయటకు కావచ్చు.. ఆమె హాట్ హాట్ డ్రెస్సుల ఫొటో షూట్లు చేస్తూ వస్తోంది.
ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు అనేక కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక సినిమాలు, వెబ్ సీరిస్‌ల విషయంలో, డ్రెస్సులు వేసుకునే విషయంలో అక్కినేని ఫ్యామిలీ జోక్యంతో పాటు అమల కండీషన్లు సమంతకు ఇబ్బందిగా మారడం ఓ కారణం అయితే చైతుతో పోలిస్తే సమంతకే ఎక్కువ క్రేజ్ ఉండడం.. ఈ కారణంగా ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి చివరకు అది తీవ్రమైన ఇగోకు దారి తీయడం కూడా జరిగిందని అంటున్నారు.
ఇక ది ఫ్యామిల్ మ్యాన్ 2 సిరీస్‌లో సామ్ బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసింది. ఇది కూడా అక్కినేని ఫ్యామిలీని తీవ్రంగా డిజప్పాయింట్ చేసిందట. అయితే ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీదే పూర్తిగా తప్పని చెప్పలేం. పెళ్లయ్యాక ఏ భారతీయ మహిళ అయినా కూడా సాంప్రదాయంగానే ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అంతకు ముందు హీరోయిన్ అయినా కూడా అక్కినేని ఫ్యామిలీ కోడలు అయ్యాక అమల ఎప్పుడూ పరిధి దాటలేదు. ఇప్పుడు సామ్ విషయంలో వాళ్లు అదే కోరుకుని ఉంటారు. అయితే మోడ్రన్ గర్ల్ అయిన సామ్‌కు ఇది నచ్చకపోవచ్చు.