Moviesచైతు - విడాకుల మ్యాట‌ర్లో మ‌రో ట్విస్ట్‌... మెగాస్టార్ ఎంట్రీ...!

చైతు – విడాకుల మ్యాట‌ర్లో మ‌రో ట్విస్ట్‌… మెగాస్టార్ ఎంట్రీ…!

అక్కినేని సమంత – నాగచైతన్య విడాకుల వ్య‌వ‌హారం టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా చ‌ర్చ‌ల్లో ఉంది. ఈ వార్త‌లు ఎలా ? ఉన్నా స‌మంత వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు మాత్రం వీరి విడాకులు తీసుకుంటున్నార‌న్న వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూర్చేలా ఉంది. చైతు కూడా తీవ్ర ఆవేద‌న‌తో ఉన్న‌ట్టే మ‌నోడి మాట‌లు చెపుతున్నారు. ఈ ఇద్ద‌రూ కూడా ఒకే వేదిక మీద‌కు వ‌చ్చి ఇవ‌న్నీ పుకార్లు అని మాత్రం కొట్టిప‌డేయ‌డం లేదు. వీరిద్ద‌రు వేర్వేరుగానే ఉంటున్నారు.

స‌మంత కూడా చైతు లేకుండా ఏ టూర్‌కు వెళ్లేది కాదు. అలాంటిది ఆమె తాజాగా గోవా టూర్‌కు త‌న స్నేహితుల‌తో మాత్ర‌మే క‌లిసి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. చైతు మాత్రం ల‌వ్ స్టోరీ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తూ… ఆ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్నాడు. ఇక వీరిద్ద‌రు క‌లిసి ఉండేందుకు ఫ్యామిలీ కోర్టు కౌన్సెలింగ్ ఇచ్చినా కూడా వీరు ఒప్పుకోలేద‌ని.. వీరు విడిపోవ‌డ‌మే ఫైనల్ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఒక్క‌టే హాట్ టాపిక్‌.

అయితే ఇదంతా ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇష్యూలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట‌ర్ అయిన‌ట్టు తెలుస్తోంది. చైతు – సామ్‌ను క‌లిపేందుకు చిరు ప్ర‌య‌త్నాలు ప్రారంభించార‌ట‌. అందుకే చైతు ల‌వ్ స్టోరీ ఫంక్ష‌న్‌కు సైతం చిరు గెస్ట్‌గా వ‌చ్చారు. మ‌రోవైపు అక్కినేని, సామ్ ఫ్యాన్స్ మాత్రం వీరు విడిపోకుండా చూడాల‌ని సోష‌ల్ మీడియాలో రిక్వెస్టులు చేస్తున్నారు. మ‌రి చిరు లేదా ఇత‌రుల ప్ర‌య‌త్నాలు ఈ విష‌యంలో ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ? చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news