సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన వ్యక్తి. సినిమాల పరంగానే కాకుండా ఈ మధ్య తరచుగా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు ఈయన. ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా ప్రకాష్ రాజ్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.
అయితే, ఇప్పుడు ఆయన యాంకర అనసూయ మీద పడ్డట్లు తెలుస్తుంది. ఆమె గురించి ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అనసూయ గురించి మాట్లాడుతూ.. ఆమె మంచి నటి.. చక్కగా డ్యాన్స్ కూడా చేస్తుంది.కానీ, అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆమె వేసుకునే డ్రెస్సింగ్ మాత్రం బాగోదని..నాకు నచ్చదు అని చెప్పుకోచ్చారు. జబర్దస్త్ షోలో ఒకవైపు రోజా నిండైన వస్త్రధారణతో ఉంటే.. అనసూయ మాత్రం అలా పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడ, బాగోదు అని.. అదొక్కటే అనసూయకు సంబంధించి తనకు నచ్చని విషయం అని వ్యాఖ్యానించారు.
ఇక అనసూయ దీనికి ఘాటైన జవాబు ఇస్తూనే ..స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. ట్విట్టర్ వేదికగా ..”ఎలాంటి దుస్తులు ధరించాలనేది ఒక వ్యక్తి పరసనల్ విషయం. ఆల్కహాల్ తీసుకునే సన్నివేశాలు, అద్వాన్నమైన దుస్తులు ధరిస్తూ, మహిళలను అవమానపరిచే సన్నివేశాల్లో నటించిన ఆ సీనియర్ నటుడుని ఎందుకు ప్రశ్నించలేరు..? పెళ్లి చేసుకొని పిల్లలున్న హీరోలు.. తెరపై హీరోయిన్లతో ఎందుకు రొమాన్స్ చేస్తున్నారో ఎవరైనా ప్రశ్నించారా.? చొక్కా లేకుండా హీరోలు తమ శరీరాలను చూపిస్తే ఎందుకు అడగరు..? మీ పని మీరు చేసుకోండి’ అని పోస్ట్ చేసింది