Moviesతండ్రికి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన బ్రాహ్మణి ..ఏంటో మీరు చూసేయండి..!!

తండ్రికి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన బ్రాహ్మణి ..ఏంటో మీరు చూసేయండి..!!

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అది లేదని తేలిపోయింది. ఇక దీంతో ఈ సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చని అంటున్నారు.

కాగా తన కెరీర్ లోనే ఇది వరుకు ఎప్పుడు చేయని యాంకరింగ్ వైపు అడుగులు వేసారు నందమూరి బాలకృష్ణ. నందమూరి హీరో కొత్త అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఆహా వాళ్లతో కలిసి బాలకృష్ణ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం హోస్ట్ గా చేయబోతున్నారు. బాల కృషణ ఆహా వాళ్లతో కలసి..అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే..అనే పేరుతో ఓ టాక్ షో ని నిర్వహిస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ టాక్ షో ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి బాలకృష్ణ ఓ ల‌గ్జ‌రీ కారులో రాగా.. ఇది అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

 

ఇక బాల‌య్య కు ఈ కారును ఎవరు గిఫ్ట్ గా ఇచ్చారో తెలుసా..?? ఆయన పెద్ద కూతురు నారా బ్రాహ్మణి. యస్.. నారా బ్రాహ్మణి తన తండ్రికి ఎంతో ప్రేమగా..తనకు ఇష్టమైన కారును బహుమతిగా ఇచ్చినట్టు టాలీవుడ్ లో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ కారు విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గ‌త కొద్ది రోజులుగా బాల‌కృష్ణ ఈ కారులోనే ప్ర‌యాణిస్తున్నట్టు తెలుస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news